ఎరువుల దుకాణాల్లో వ్యవసాయ శాఖ అధికారుల తనిఖీలు

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): రైతులకు నిబంధనల ప్రకారం ఎరువులు అందించడంతోపాటు, ఎరువుల విక్రయాల్లో పారదర్శకతను పాటించేలా చూడటమే లక్ష్యంగా వ్యవసాయ శాఖ అధికారులు గురువారం మందమర్రి మండలంలోని ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. ఇంటర్నల్ స్క్వాడ్ ఇన్‌స్పెక్షన్‌లో భాగంగా మంచిర్యాల సహాయ వ్యవసాయ సంచాలకులు (ఏడీఏ) మామిడి కృష్ణ, మండల వ్యవసాయ అధికారి జి. కిరణ్మయితో కలిసి పులిమడుగు, మందమర్రి గ్రామాల్లోని ఎరువుల విక్రయ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా దుకాణాల్లో ఉన్న ఎరువుల నిల్వలు, విక్రయాల రికార్డులు, స్టాక్ రిజిస్టర్లు, బిల్...