మందమర్రి ఏరియా బీసీ లైజన్ ఆఫీసర్‌గా పి. రాజు

నూతన బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఘన సన్మానం కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): సింగరేణి మందమర్రి ఏరియా బీసీ లైజన్ ఆఫీసర్‌గా నూతనంగా ఎంపికైన పి. రాజు (అడిషనల్ మేనేజర్, శాంతిఖని)కు మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏరియా ఉన్నతాధికారులు, వివిధ బీసీ సంఘాల నాయకులు సైతం పి. రాజును శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్...