రిటైర్డ్ సింగరేణి కార్మికులు లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించాలి
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): సింగరేణి మందమర్రి డివిజన్లో పనిచేసి పదవీ విరమణ పొందిన కార్మికులు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా తమ లైఫ్ సర్టిఫికెట్లను సమర్పించి, హెల్త్ కార్డులను రెన్యువల్ చేసుకోవాలని సింగరేణి రిటైర్డ్ కార్మిక సంఘం అధ్యక్షుడు వాసాల శంకర్ కోరారు. శుక్రవారం మందమర్రి పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రిటైర్డ్ కార్మికులు లైఫ్ సర్టిఫికెట్లను సమర్పించి, హెల్త్ కార్డులను రెన్యువల్ చేసుకోవడం ద్వారా పెన్షన్‌తో పాటు వైద్య సౌకర్యాలను నిరంతరంగా పొందవచ్చని తెలిపారు. లైఫ్...