NIGAMA MEDIA (P) LTD
8.6 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, October 25, 2026

బియ్యం ధరల పెంపును అరికట్టాలి

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

బ్లాక్ మార్కెట్‌కు అడ్డుకట్ట వేయాలి
ఎంసీపీఐయూ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్

కోల్ బెల్ట్ న్యూస్(బెల్లంపల్లి):

వాతావరణ పరిస్థితులను సాకుగా చూపిస్తూ మార్కెట్‌లో బియ్యం ధరలను ఇష్టారాజ్యంగా పెంచి విక్రయించడాన్ని ఎంసీపీఐయూ పార్టీ మంచిర్యాల జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. బియ్యం ధరల పెరుగుదలతో పేద, మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారం పడుతోందని పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ ఆందోళన వ్యక్తం చేశారు.

ఆదివారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ పరిస్థితులను ఆసరాగా చేసుకుని కొంతమంది స్వార్థపర వ్యాపారులు బియ్యం నిల్వలను అక్రమంగా దాచిపెట్టి, కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఫలితంగా మార్కెట్‌లో బియ్యం ధరలు రోజురోజుకూ పెరుగుతూ సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా పోతున్నాయని పేర్కొన్నారు.ప్రధానంగా పేద, మధ్యతరగతి కుటుంబాలు నిత్యం వినియోగించే సన్నబియ్యం ధరలు కిలోకు రూ.60 నుంచి రూ.95 వరకు పెరిగాయని, ఈ ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంకటేష్ అన్నారు.

వాతావరణ పరిస్థితుల కారణంగా పంట దిగుబడులు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, దానిని సాకుగా చేసుకుని కొంతమంది వ్యాపారులు అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్‌కు పాల్పడుతూ ప్రజలపై అదనపు భారాన్ని మోపుతున్నారని విమర్శించారు.ప్రజలకు నిత్యావసరమైన బియ్యం ధరలను నియంత్రించడంలో సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బియ్యం హోల్‌సేల్ వ్యాపార కేంద్రాలు, రైస్ మిల్లులపై ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలతో తనిఖీలు నిర్వహించాలని కోరారు. అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యాన్ని గుర్తించి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు, బియ్యం సరసమైన ధరలకు ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

బియ్యం ధరల నియంత్రణపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తే, ప్రజల పక్షాన ఎంసీపీఐయూ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వెంకటేష్ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మండల కార్యదర్శి తోగరి రాహుల్, బెల్లంపల్లి పట్టణ కార్యదర్శి ఆరేపల్లి రమేష్, సంబోధి రాజేష్, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.