NIGAMA MEDIA (P) LTD
11.8 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Monday, October 19, 2026

బీబీపేటలో బతుకమ్మ సంబరాలు

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

ఆటపాటలతో ఆడపడుచుల సందడి
అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్ష

కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):

మారెడ్డి జిల్లా బిబిపేట మండల కేంద్రంలో బతుకమ్మ పండుగ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య కొనసాగాయి. ఈ సందర్భంగా తాజా మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ ఆడపడుచులతో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొని, ఆటపాటలతో సందడి చేశారు. ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో’ అంటూ సంప్రదాయ పాటలు పాడుతూ మహిళలతో కలిసి ఉత్సాహంగా పండుగను జరుపుకున్నారు.

ఈ సందర్భంగా కొరివి నీరజ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. ఏడాదికి ఒకసారి వచ్చే ఈ పండుగను అక్కాచెల్లెళ్లు, ఆడపడుచులు అందరూ కలిసిమెలిసి ఆనందంగా జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్లు సుఖశాంతులతో జీవించాలని, కుటుంబాలన్నీ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ఇలాంటి పండుగలను ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో జరుపుకోవాలని ఆమె సూచించారు. ఆడపడుచులు ఆనందంగా పండుగలు నిర్వహించుకునేందుకు ప్రభుత్వం తగిన సహకారం, అవసరమైన సదుపాయాలు కల్పించాలని కోరారు. మహిళలందరితో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని కొరివి నీరజ పేర్కొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.