NIGAMA MEDIA (P) LTD
12.1 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Saturday, October 17, 2026

భక్తిశ్రద్ధలతో సర్వజననీ దుర్గాదేవి పూజలు

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

మంచిర్యాలలో వైభవంగా 17వ వార్షికోత్సవ వేడుకలు

కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ముఖరం చౌరస్తా సమీపంలో గల విశ్వనాథ కాలక్షేప మండపంలో సర్వజననీ దుర్గాదేవి పూజా కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి పూజలను భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా సర్వజననీ దుర్గాదేవి పూజా కమిటీ అధ్యక్షుడు బోడ ధర్మేందర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. సర్వజననీ దుర్గాదేవి పూజ 17వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు.

వేదమంత్రాల నడుమ అమ్మవారిని ఆరాధిస్తూ, జ్యోతి ప్రజ్వలన, అఖండ దీప ప్రజ్వలన కార్యక్రమాలను నిర్వహించారు. అమ్మవారి దివ్య సన్నిధిలో దీపకాంతులు, భక్తి గీతాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మండపం భక్తిమయంగా మారింది. జగజ్జననిగా, సకల లోకాలకు శక్తి స్వరూపిణిగా కొలువుదీరిన దుర్గాదేవిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. అమ్మవారి కృపాకటాక్షాలు సకల జనులపై ప్రసరించాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని భక్తులు ప్రార్థిస్తున్నారు.

ఈ సందర్భంగా భక్తులకు అమ్మవారి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. దుర్గామాత ఆశీస్సులతో సమాజంలో ధర్మం, శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.