భక్తిశ్రద్ధలతో సర్వజననీ దుర్గాదేవి పూజలు
మంచిర్యాలలో వైభవంగా 17వ వార్షికోత్సవ వేడుకలు కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల): మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ముఖరం చౌరస్తా సమీపంలో గల విశ్వనాథ కాలక్షేప మండపంలో సర్వజననీ దుర్గాదేవి పూజా కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి పూజలను భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా సర్వజననీ దుర్గాదేవి పూజా కమిటీ అధ్యక్షుడు బోడ ధర్మేందర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. సర్వజననీ దుర్గాదేవి పూజ 17వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. వేదమంత్రాల నడుమ అమ్మవారిని ఆరాధిస్తూ, జ్యోతి ప్రజ్వలన, అఖండ దీప ప్రజ్వలన కార్యక్రమాలను నిర్వహించారు....