NIGAMA MEDIA (P) LTD
7.5 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Monday, October 12, 2026

పెద్దపల్లిలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు మరిపెల్లి మాధవి

కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి):

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం పెద్దపల్లిలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు మరిపెల్లి మాధవి ముఖ్య అతిథిగా హాజరై మహిళలతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు ఎంతో ఉత్సాహంగా, ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పండుగ వాతావరణంతో కార్యక్రమ ప్రాంగణం సందడిగా మారింది.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, ఐక్యతకు, తెలంగాణ సంస్కృతి వైభవానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. తరతరాలుగా వస్తున్న తెలంగాణ సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో ఇటువంటి వేడుకలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. మహిళలందరూ ఐక్యంగా బతుకమ్మ పండుగను జరుపుకుంటూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి మహిళా కార్యకర్తలు సలేంద్ర మమతారాణి, సలేంద్ర రోజరమణి, ముస్థ్యాల స్వప్న, శ్రీలత, అర్నకొండ సరిత, అర్నకొండ పద్మ, కీర్తి ఉమ, రాజం జ్యోతి, దాసరి అంజలి, ఎం.డి. గౌస్య బేగం తదితరులు పాల్గొని బతుకమ్మ సంబరాలను విజయవంతం చేశారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.