NIGAMA MEDIA (P) LTD
8.8 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Monday, October 12, 2026

రాజ్యాంగ హక్కులను కాలరాయడం ప్రధాని మోదీకే చెల్లింది

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

ఓటు హక్కును హరించే ఎస్‌ఐఆర్‌ విధానాన్ని వ్యతిరేకించాలి..
ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలి
MCPI మంచిర్యాల జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్

కోల్ బెల్ట్ న్యూస్(బెల్లంపల్లి): 

దేశంలో రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాలరాస్తూ ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలిగించే చర్యలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం పాల్పడుతోందని మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (యునైటెడ్) మంచిర్యాల జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ విమర్శించారు.ఆదివారం ఆయన బెల్లంపల్లిలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ దేశ పౌరుల ఓటు హక్కును హరించేలా ఉన్న ఎస్‌ఐఆర్‌ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌) విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఈ విధానానికి ప్రధాన బాధ్యులైన కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఢిల్లీలో నిర్వహించ తలపెట్టిన ప్రజా ఆందోళన మార్చ్‌లో పాల్గొనేందుకు వస్తున్న ప్రజలపై ముందస్తు నిర్బంధాలు విధించడం, ఉద్యమ కార్యకర్తలు, నిర్వాహకుల ఇళ్లకు పోలీసులు వెళ్లడం, వివిధ ఆంక్షలు విధించడం ప్రజాస్వామ్య హక్కులను హరించడమేనని వెంకటేష్ అన్నారు. ప్రజలు తమ నిరసనను శాంతియుతంగా వ్యక్తం చేసే హక్కును అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. ఆందోళనను అడ్డుకునేందుకు 250 రైలు సర్వీసులను రద్దు చేయడం, 57 ఢిల్లీ మెట్రో స్టేషన్లను మూసివేయడం, ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం, ఏడు అంచెల భారీ బారికేడ్లు ఏర్పాటు చేయడం, వ్యాపార సముదాయాలను మూసివేయించడం వంటి చర్యలు ప్రజల స్వేచ్ఛాయుత రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగిస్తాయని విమర్శించారు. ఈ ఆంక్షల వల్ల రైతులు, కార్మికులు, రోజువారీ కూలీలు, విద్యార్థులు, వైద్య చికిత్స కోసం ప్రయాణించే రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

భావప్రకటనా స్వేచ్ఛ, శాంతియుతంగా సమావేశమయ్యే హక్కు, దేశంలో స్వేచ్ఛగా సంచరించే హక్కులు రాజ్యాంగం పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కులని ఆయన గుర్తుచేశారు. పరిపాలనాపరమైన ఆంక్షలు చట్టబద్ధంగా ఉండాలని, శాంతియుతంగా ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనే ప్రజలకు అనవసరమైన అడ్డంకులు సృష్టించకూడదని స్పష్టం చేశారు.శాంతియుత ప్రజా ఉద్యమాలను అణచివేయడానికి ప్రయత్నించడం కంటే ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని వెంకటేష్ డిమాండ్ చేశారు. ప్రజల గొంతుకను నొక్కివేయడం ద్వారా ఉద్యమాలను ఆపలేరని, పోరాటాలను ఎంతగా అణచివేయాలని ప్రయత్నిస్తే అంతకంటే ఎక్కువగా ఉద్యమాలు ఉద్ధృతమవుతాయని ఆయన హెచ్చరించారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.