NIGAMA MEDIA (P) LTD
11.9 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Saturday, October 10, 2026

మందమర్రిలో వీధి దీపాల ఏర్పాటు

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

పోస్టాఫీస్‌ నుంచి పాలచెట్టు వరకు వెలుగులు
ప్రజల ఇబ్బందులకు పరిష్కారం

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని పోస్టాఫీస్‌ నుంచి పాలచెట్టు వరకు ఉన్న రహదారిపై విద్యుత్‌ వీధి దీపాలు లేకపోవడంతో రాత్రి వేళల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ మందమర్రి ఏరియా జనరల్‌ మేనేజర్‌ వెంటనే స్పందించారు. రహదారిపై వీధి దీపాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

జనరల్‌ మేనేజర్‌ ఆదేశాల మేరకు సంబంధిత సిబ్బంది పోస్టాఫీస్‌ నుంచి పాలచెట్టు వరకు రహదారికి ఇరువైపులా విద్యుత్‌ వీధి దీపాలను ఏర్పాటు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో రాత్రి వేళల్లో రాకపోకలు సాగించే ప్రజలకు మెరుగైన వెలుతురు సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. వీధి దీపాల ఏర్పాటుతో స్థానికుల ఇబ్బందులు తొలగడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజల సమస్యను గుర్తించి తక్షణమే స్పందించి అవసరమైన సౌకర్యాన్ని కల్పించిన సింగరేణి మందమర్రి ఏరియా జనరల్‌ మేనేజర్‌కు, మందమర్రి మున్సిపల్‌ కమిషనర్‌ తుంగపిండి రాజలింగుకు, కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు మంద తిరుమలరెడ్డి, స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

 

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.