NIGAMA MEDIA (P) LTD
14.2 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Thursday, October 8, 2026

30 మందికి ఉచిత కంటి ఆపరేషన్లు

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

150 మందికి కంటి పరీక్షలు..
17 మందికి విజయవంతంగా శస్త్రచికిత్స..

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య సేవలు నిరుపేదలకు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో సుమారు 150 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వైద్యుల పరీక్షల అనంతరం 30 మందికి కంటి ఆపరేషన్లు అవసరమని గుర్తించారు. వెంటనే స్పందించిన మందమర్రి లయన్స్ క్లబ్ ప్రతినిధులు ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసి, సోమవారం వారిని బెల్లంపల్లిలోని పి. సత్యనారాయణ లయన్స్ కంటి ఆసుపత్రికి ఉచిత కంటి ఆపరేషన్ల నిమిత్తం తరలించారు. ఆసుపత్రిలో మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు చేపట్టారు.

మంగళవారం ఉదయం 17 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించారు. మిగిలిన 13 మందికి వైద్యుల సూచనల మేరకు నాలుగు రోజుల అనంతరం కంటి ఆపరేషన్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆపరేషన్లు పూర్తయిన 17 మందిని మందమర్రి లయన్స్ క్లబ్ ప్రతినిధులు బుధవారం ప్రత్యేకంగా వాహనంలో సురక్షితంగా వారి స్వగృహాలకు చేర్చారు. కంటి సమస్యలతో బాధపడుతున్న నిరుపేదలకు ఉచితంగా వైద్య సేవలు, శస్త్రచికిత్సలు అందించడం పట్ల పలువురు లయన్స్ క్లబ్ సేవలను అభినందించారు.

ఈ సందర్భంగా మందమర్రి లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ సోతుకు సుదర్శన్ రావు, పోలు శ్రీనివాస్, క్లబ్ అధ్యక్షుడు పెండ్యాల గౌతం, కార్యదర్శి ఎండి జాకీర్ మాట్లాడుతూ.. కంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైనా నిర్భయంగా లయన్స్ క్లబ్‌ను సంప్రదించవచ్చని తెలిపారు. అవసరమైన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించేందుకు లయన్స్ క్లబ్ తరఫున సహకారం అందిస్తామని పేర్కొన్నారు.

కంటి ఆపరేషన్లు చేయించుకున్న రోగులను తమ కుటుంబ సభ్యులుగా భావించి, ఆప్యాయతతో సేవలందించిన పి. సత్యనారాయణ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యులు, సిబ్బందికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పేదలకు ఉచిత కంటి వైద్యం అందించడం ద్వారా లయన్స్ క్లబ్ తన సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తుందని వారు పేర్కొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.