NIGAMA MEDIA (P) LTD
7.3 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Tuesday, September 22, 2026

బీబీపేటలో భక్తిశ్రద్ధల మధ్య ముగిసిన వినాయక నవరాత్రి ఉత్సవాలు

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):

కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలు, ఆధ్యాత్మిక వాతావరణం మధ్య ఘనంగా ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు, భజనలు, అన్నదాన కార్యక్రమాలతో కొలువుదీరిన గణనాథులను మంగళవారం భక్తులు భారీ సంఖ్యలో తరలివెళ్లి నిమజ్జనం చేశారు. మండలంలో ప్రతి సంవత్సరం నవరాత్రి ఉత్సవాలు ముగిసిన అనంతరం ఆయా గ్రామాల్లోని వినాయక విగ్రహాలను ఒకేసారి నిమజ్జనానికి తరలించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం నుంచే వినాయక మండపాల వద్ద నిర్వాహకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు.

సాయంత్రం వినాయక విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన వాహనాలపై ఏర్పాటు చేసి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపుగా నిమజ్జనానికి తరలించారు. యువత, మహిళలు, చిన్నారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి వీడ్కోలు పలికారు. ‘జై గణపయ్య.. జై జై గణపయ్య’ అంటూ భక్తులు చేసిన నినాదాలతో గ్రామ పరిసరాలు మార్మోగాయి. పలుచోట్ల యువత ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ నిమజ్జన ఊరేగింపులో పాల్గొన్నారు.

50కిపైగా వినాయక మండపాల సందర్శన………..

నిమజ్జన కార్యక్రమం సందర్భంగా ముదిరాజ్ సంఘం జిల్లా కార్యదర్శి కొరివి నర్సింలు మండలంలోని 50కిపైగా వినాయక మండపాలను సందర్శించి గణనాథులను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజల్లో పాల్గొని భక్తులతో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గణనాథుడి ఆశీస్సులతో ప్రజలందరూ అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు. గ్రామస్తులంతా సుఖసంతోషాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని గణనాథుడిని ప్రార్థించినట్లు తెలిపారు. నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, విజయవంతంగా నిర్వహించిన మండపాల నిర్వాహకులు, యువత, భక్తులకు ఆయన అభినందనలు తెలిపారు.

నిమజ్జన కార్యక్రమం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిర్వాహకులు, గ్రామస్తులు సమన్వయంతో కార్యక్రమాన్ని నిర్వహించారు. చివరగా గణనాథులకు ఘనంగా వీడ్కోలు పలుకుతూ నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేశారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.