బీబీపేటలో భక్తిశ్రద్ధల మధ్య ముగిసిన వినాయక నవరాత్రి ఉత్సవాలు
కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలు, ఆధ్యాత్మిక వాతావరణం మధ్య ఘనంగా ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు, భజనలు, అన్నదాన కార్యక్రమాలతో కొలువుదీరిన గణనాథులను మంగళవారం భక్తులు భారీ సంఖ్యలో తరలివెళ్లి నిమజ్జనం చేశారు. మండలంలో ప్రతి సంవత్సరం నవరాత్రి ఉత్సవాలు ముగిసిన అనంతరం ఆయా గ్రామాల్లోని వినాయక విగ్రహాలను ఒకేసారి నిమజ్జనానికి తరలించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం నుంచే వినాయక మండపాల వద్ద నిర్వాహకులు ప్రత్యేక పూజలు,...