యాడారం–శివరామిరెడ్డిపల్లి గ్రామాల్లో స్వాగతతోరణానికి భూమిపూజ

కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): బీబీపేట మండలంలోని యాడారం, శివరామిరెడ్డిపల్లి గ్రామాల ఉమ్మడి వి.డి.సి. కమిటీ ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహకారంతో నిర్మించనున్న కమాన్‌ (స్వాగత తోరణం) నిర్మాణానికి బుధవారం భూమిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామాల అభివృద్ధి, ఐక్యతకు ప్రతీకగా నిలిచేలా స్వాగత తోరణాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వి.డి.సి. కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, వేదమంత్రోచ్ఛారణల మధ్య భూమిపూజ కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామ ప్రజల సహకారంతో చేపడుతున్న ఈ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని...