ఆటో డ్రైవర్ల బందుకు ఎంసీపీఐయూ, ఏఐసీటీయూ సంపూర్ణ మద్దతు
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలి ఏఐసీటీయూ జిల్లా కార్యదర్శి పసులేటి వెంకటేష్ కోల్ బెల్ట్ న్యూస్(బెల్లంపల్లి): ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అర్ధరాత్రి నుంచి ఆటో డ్రైవర్లు చేపట్టనున్న బంద్‌కు ఎంసీపీఐయూ, అఖిల భారత కార్మిక సంఘాల కేంద్రం (ఏఐసీటీయూ) సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ మేరకు ఎంసీపీఐయూ పార్టీ కార్యాలయంలో ఏఐసీటీయూ జిల్లా కార్యదర్శి పసులేటి వెంకటేష్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఎనిమిది లక్షల మంది ఆటో డ్రైవర్లు ఆటో వృత్తినే ప్రధాన జీవనాధారంగా చేసుకుని...