34 C
Munich
Wednesday, July 29, 2026

నేరెళ్ల ఘటన మళ్లీ తెరపై.. కవిత ప్రశ్నలతో రాజకీయ వేడి

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

బాధితులకు న్యాయం ఎక్కడ?..
కేటీఆర్, రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లను ఏకకాలంలో ప్రశ్నించిన కవిత

కోల్ బెల్ట్ న్యూస్(సిరిసిల్ల):

సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో జరిగిన దళితులపై దాడి ఘటన మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది. భారత రాష్ట్ర సమితి (అప్పటి టీఆర్‌ఎస్‌) ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఇసుక అక్రమ రవాణాను ప్రశ్నించిన దళితులపై దాడులు జరిగాయని, పోలీసు కేసులు, చిత్రహింసలు ఎదుర్కొన్నారని తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలో కొందరు ప్రాణాలు కోల్పోయినట్లు కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని వెలుగులోకి రాకుండా ప్రయత్నించిందనే విమర్శలు వినిపించగా, సోషల్ మీడియా ద్వారా విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఈ కేసులో ప్రధాన బాధ్యులపై అప్పటి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోలేదని అప్పట్లో ప్రతిపక్షాలు ఆరోపించాయి. అనంతరం 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నేరెళ్ల ఘటనను కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి పలుమార్లు ప్రస్తావిస్తూ, అధికారంలోకి వస్తే బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వం ఏర్పడి చాలా కాలం గడిచినా ఈ కేసులో గణనీయమైన పురోగతి కనిపించలేదని బాధితులు, స్థానికులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే నేరెళ్ల గ్రామానికి సంబంధించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా గతంలో బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. జాతీయ ఎస్సీ కమిషన్ గ్రామాన్ని సందర్శించి బాధితుల వాంగ్మూలాలు సేకరించినప్పటికీ, ఘటనకు కారణమైన వారిపై ఇప్పటివరకు స్పష్టమైన చర్యలు కనిపించలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో TRS చీఫ్ కల్వకుంట్ల కవిత నేరెళ్ల గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె అప్పటి మంత్రి కేటీఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్‌లను ఏకకాలంలో ప్రశ్నించారు. ధనదాహం కోసం నేరెళ్ల పేదల జీవితాలతో పెద్దలు ఆడుకున్నారని ఆమె ఆరోపించారు. బాధితులకు న్యాయం చేయడంలో గత, ప్రస్తుత ప్రభుత్వాలు, అలాగే హామీలు ఇచ్చిన నాయకులు ఎందుకు విఫలమయ్యారని ప్రశ్నించారు.

కవిత లేవనెత్తిన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? నేరెళ్ల ఘటనలో బాధ్యులపై చర్యల దిశగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? అలాగే ఈ అంశం రాజకీయంగా ఎలాంటి మలుపులు తిరుగుతుంది? అనే అంశాలపై ఆసక్తి నెలకొంది.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.