నేరెళ్ల ఘటన మళ్లీ తెరపై.. కవిత ప్రశ్నలతో రాజకీయ వేడి
బాధితులకు న్యాయం ఎక్కడ?.. కేటీఆర్, రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లను ఏకకాలంలో ప్రశ్నించిన కవిత కోల్ బెల్ట్ న్యూస్(సిరిసిల్ల): సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో జరిగిన దళితులపై దాడి ఘటన మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది. భారత రాష్ట్ర సమితి (అప్పటి టీఆర్‌ఎస్) ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఇసుక అక్రమ రవాణాను ప్రశ్నించిన దళితులపై దాడులు జరిగాయని, పోలీసు కేసులు, చిత్రహింసలు ఎదుర్కొన్నారని తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలో కొందరు ప్రాణాలు కోల్పోయినట్లు కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని...