23.9 C
Munich
Monday, July 27, 2026

Congress : రఘునాథ…. నేర్వాలి రాజకీయ చతురత

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

సమన్వయం సాధ్యమయ్యేనా ?
ముందున్నది ఎన్నికల ఇంటిపోరు
డీసీసీ పదవుల పంపకమూ కత్తిమీది సామే

Congress : మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి సీనియర్ కార్యకర్త పి. రఘునాథ రెడ్డిని అధిష్టానం ఎంపిక చేసింది. సౌమ్యుడు, వివాదరహితుడు, పార్టీలో చేరిన నాటి నుంచి నేటి వరకు మూడు రంగుల జెండాను నమ్ముకొని సేవచేస్తున్నారు. పార్టీ అనుబంధ విభాగాల్లో మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సేవ చేసిన అనుభవం. వీటన్నిటికీ తోడు మంత్రి వివేక్, ఎమ్మెల్యేలు వినోద్, ప్రేమ్ సాగర్ రావ్ ఆసీస్సులు. ఎన్నో అవకాశాలు ఇతర పార్టీల నుంచి అవకాశాలు వచ్చినప్పటికీ దూరంగానే ఉన్నారు. అందుకే అధ్యక్ష భాద్యతలను ఆయనపై ఢిల్లీ పెద్దలు మోపారు.

రఘునాథ రెడ్డి కి ఉన్నటువంటి ఆర్థిక వనరులతో పార్టీని నెట్టుకు రావడం కొంతమేరకు కష్టమే అంటున్నారు పార్టీ శ్రేణులు. అంతే కాదు ఇప్పుడు అయన చేతపట్టింది అధ్యక్ష పదవి అనడం కంటే సూదుల ముల్లె అంటే బాగుంటదంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు. జిల్లాలోని నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేయడం కూడా అంత సులభం కాదు. అసలే కాంగ్రెస్ పార్టీ. ఆయన పార్టీ రంగు, రుచి, వాసన అన్నీ తెలిసిన నాయకుడే. జిల్లాలో ఒక ఎంపీ, ఒక మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ ముగ్గురిని సమన్వయం చేయడం ఆయనకు సాధ్యమవుతుందా ? అనే అనుమానాలు సైతం పార్టీ శ్రేణుల్లో వ్యాకరమవుతున్నాయి. ఇప్పటికే మంత్రి వివేక్ కు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్ ల మధ్య అనారోగ్యకరమైన వాతావరణం కొనసాగుతోంది. పార్టీ అధ్యక్ష పదవి కోసం పోటీపడిన వారు కూడా క్రికెట్ టీం అంత ఉంది. ఇప్పుడు వారందరిని కౌగిలించుకున్నా కూడా వారు వెదజల్లే ప్రేమాభిమానాల్లో సువాసన ఏమేరకు ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదంటున్నారు పలువురు కార్యకర్తలు.

రాబోయే కాలమంతా స్థానిక ఎన్నికల గోల. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పిటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్షాల సవాల్ ను ఎదుర్కోవాలి. అభ్యర్థులను గెలిపించుకోవాలి. మండల అధ్యక్ష, మున్సిపల్ చైర్మన్, జెడ్పి చైర్మన్ స్థానాలను దక్కించుకోవడం రఘునాథ రెడ్డి కి ఇప్పుడు కొత్త సవాల్. ఎందుకంటే ఆయన భాద్యతలు చేపట్టిన వెంటనే వస్తున్న ఎన్నికలు. జిల్లాల్లో ఇప్పటి వరకు సొంతింటి పరిస్థితి, పొరిగింటి పరిస్థితి ఏమిటనేది తెలియదు. ఇది అంతుబట్టాలంటే సమయం కావాలి. ఇంత అతితక్కువ సమయంలో పార్టీ నిర్ణయించిన ఎన్నికల లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమే అంటున్నారు. ఇది ఇలా ఉండగా జిల్లలో పార్టీ పదవులను ఆశించేవారు కూడా ఎక్కువగానే ఉన్నారు. పార్టీ అనుబంధ సంఘాలను కూడా భర్తీ చేయాలి. ఇలా పార్టీ, అనుబంధ సంఘాలను సమన్వయం చేసుకోవడం కూడా ప్రస్తుత పరిస్థితుల్లో సవాల్ తో కూడుకున్నదే అంటున్నారు పార్టీ శ్రేణులు. అందుకే పార్టీ శ్రేణులు ఏమంటున్నారంటే….పార్టీ ఎమ్మెల్యేల బలం ఎంత ఉన్నా…..రఘునాథ…. నేర్వాలి రాజకీయ చతురత….. అంటున్నారు జిల్లా కాంగ్రెస్ శ్రేణులు.


పొలిటికల్ బ్యూరో
కొమ్మెర అనిల్ కుమార్, ఎమ్మే, బీఎడ్.
9603982983.

—————————————————-

 

 

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.