23.9 C
Munich
Monday, July 27, 2026

Mavoist : మావోయిస్టులకు కలిసిరాని విజయవాడ

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

నాడు అనుపురం కొమురయ్య
నేడు మడావి హిడ్మ
పార్టీలో ఇద్దరు కీలక నేతలే

Mavoist : మావోయిస్టు పార్టీ విస్తరించిన ప్రాంతాల్లో ఎదో ఒక ప్రాంతంలో ఎదురుకాల్పులు జరుగుతూనే ఉన్నాయి. జరిగిన ఎదురు కాల్పుల్లో కొన్నింటిని మావోయిస్టు పార్టీ బూటకపు ఎన్కౌంటర్లుగా ఆరోపిస్తుంది. పోలీస్ శాఖ మాత్రం పక్కా సమాచారంతో గాలింపు చేస్తున్న సందర్భంలో జరిగిన ఎదురుకాల్పుల్లో పలువురు మావోయిస్టులు చనిపోయినట్టుగా ప్రకటిస్తుంది. 2026, మార్చ్ నాటికి మావోయిస్టు పార్టీని అంతమొందిస్తామని కేంద్ర ప్రభుత్వం ధీమాతో ఉంది. అందుకు తగినట్టుగా అడవుల్లో పోలీస్ బలగాలు కూడా దూసుకెళుతున్నాయి. ఇది ఇలా ఉండగా మావోయిస్టు పార్టీకి ఏపీ లోని విజయవాడ కలసి రావడంలేదనే అభిప్రాయాలు మాత్రం వ్యక్తమవుతున్నాయి.

ఉమ్మడి రాష్ట్రంలో మావోయిస్టు పార్టీ ఉనికి చెప్పుకోతగిన విదంగానే ఉండేది. ఎప్పుడు ఎక్కడో ఎదో ఒక ప్రాంతంలో తమ అలజడి సృష్టించేవారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుజురాబాద్ డివిజన్ దమ్మక్కపేట గ్రామానికి చెందిన అనుపురం కొమురయ్య @ AK జిల్లాలో కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. ఆయన కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా బాధ్యతల్లో ఉన్న సమయంలో మంథని మాజీ ఎమ్మెల్యే,, స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాద రావు హత్య కేసులో కీలక పాత్ర పోషించినట్టుగా పోలీస్ రికార్డుల్లో ఉంది. 2003 లో మంథని అడవుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో అనుపురం కొమురయ్య చనిపోయినట్టుగా కరీంనగర్ జిల్లా పోలీసులు ప్రకటించారు. కార్యదర్శిగా అనుపురం కొమురయ్య కార్యదర్శి బాధ్యతల్లో ఉన్న సమయంలోనే ఆయన చికిత్స కోసం విజయవాడ వెళ్లినట్టు సమాచారం. పక్కా సమాచారం తోనే ఆయనను అక్కడే పట్టుకొని మంథని అడవుల్లో కాల్చిచంపినట్టు మావోయిస్టు పార్టీతో పాటు కుటుంబ సభ్యులు సైతం అప్పుడు ఆరోపించారు.

తాజాగా ఏపీ లోని మారేడుమిల్లి లో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మడావి హిడ్మ హతమయ్యాడు. పక్కాసమాచారంతోనే మారేడుమిల్లి అడవుల్లో గాలింపు చేపడుతున్న సమయంలోనే జరిగిన ఎదురుకాల్పుల్లో హిడ్మతో పాటు అతని భార్య, మరికొందరు చనిపోయారని పోలీస్ శాఖ స్పష్టం చేసింది. కానీ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో హిడ్మ ఎన్కౌంటర్ బూటకం అంటూ ఆరోపించారు. హిడ్మ చికిత్స కోసం విజయవాడకు రావడంతోనే పట్టుబడినాడని, లొంగకపోయేసరికి కాల్చి చంపారని ఆరోపించాడు అభయ్. ఈ విధంగా అనుపురం కొమురయ్య, హిడ్మ ఇద్దరు కూడా చికిత్స కోసం వచ్చి విజయవాడలోనే పోలీసులకు చిక్కి చనిపోయారని పార్టీతో పాటు కుటుంబ సభ్యులు ఆరోపించడం విశేషం.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.