19.9 C
Munich
Sunday, July 26, 2026

Singareni : గైర్హాజరు కార్మికులపై అధికారుల ఒత్తిడి ఉండదు—సీతారామయ్య

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd ,RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Singareni : గైర్హాజరు కార్మికులపై సింగరేణి అధికారుల ఒత్తిడి ఇక నుంచి ఉండదని సింగరేణి కార్మిక గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య సోమవారం తెలిపారు. సింగరేణి యాజమాన్యం గుర్తింపు సంఘంతో నిర్వహించిన స్ట్రక్చర్ సమావేశంలో పలు కార్మికుల సమస్యలపై ఒప్పందం చేసుకోవడం జరిగిందని సీతారామయ్య తెలిపారు.

150 మస్టర్ల గైర్హాజరుపై అధికారుల ఒత్తిడి ఉండదు.
సొంతింటి పథకం సమస్యను తొందరలోనే పరిష్కరించుటకు అంగీకారం కుదిరింది.
హైదరాబాద్ లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం టెండర్ ప్రక్రియ పూర్తయినది. తొందరలోనే పనులు ప్రారంభమవుతాయి.
బదిలీ వర్కర్లుగా నియామకమైన వారందరూ ఇకనుంచి జనరల్ అసిస్టెంట్ ట్రేనిగా నియమించబడతారు.
మెడికల్ బోర్డును యధావిధిగా కొనసాగించుటకు ఒప్పందం జరిగింది.
జే ఎం ఓ 62, ఫోర్ మెన్ (మెకానికల్) 12, ఫోర్ మెన్ (ఎలక్ట్రికల్) 41, సూపర్వైజర్ (సివిల్) 1, ఆఫీస్ సూపరిండెంట్ 4, స్టాఫ్ నర్స్ 86, జూనియర్ అకౌంటెంట్ 1 లకు A1 గ్రేడ్ వారికే కాకుండా ఏ గ్రేడ్ లో ఐదు సంవత్సరాల సర్వీస్ ఉన్నఅందరికీ రిక్రూట్మెంట్ ద్వారా ఆఫీసర్ క్యాడర్ E1 గ్రేడ్ ఇచ్చుటకు యాజమాన్యం అంగీకారం తెలిపింది.
మారుపేర్ల సమస్యను కార్మికుల వారిగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు.
పర్సనల్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న ఉద్యోగులకు 9 మందికి రిక్రూట్మెంట్ ద్వారా ఆఫీసర్ క్యాడర్ E1 గ్రేడ్ ఇచ్చుటకు అంగీకారం కుదిరింది.
కార్మికుల సౌకర్యార్థం అన్ని గనులల్లో కప్బోర్డ్, లాకర్స్ ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదిరింది.
రూ : 1000 లోపు పెన్షన్ పొందుతున్న సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ రూ : 2016 మంజూరు చేయించడానికి యాజమాన్యం నిర్ణయం తీసుకొందని సీతారామయ్య చర్చల వివరాలను వివరించారు.

ఈ స్ట్రక్చర్ సమావేశంలో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం, గుర్తింపు సంఘం గౌరవ అధ్యక్షులు కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ,డైరెక్టర్ పా గౌతమ్ పొట్రు, డైరెక్టర్లు వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, తిరుమల్ రావు, సంబంధిత జనరల్ మేనేజర్లు, గుర్తింపు సంఘం కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్, అడిషనల్ జనరల్ సెక్రెటరీ మిర్యాల రంగయ్య , డిప్యూటీ జనరల్ సెక్రెటరీలు కే సారయ్య , కే వీరభద్రయ్య, వై వి రావు, ముస్కే సమ్మయ్య, మడ్డి ఎల్లా గౌడ్, కేంద్ర కార్యదర్శులు అక్బర్ అలీ, వంగ వెంకట్ పాల్గొన్నారు.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.