Singareni : గైర్హాజరు కార్మికులపై అధికారుల ఒత్తిడి ఉండదు—సీతారామయ్య

Singareni : గైర్హాజరు కార్మికులపై సింగరేణి అధికారుల ఒత్తిడి ఇక నుంచి ఉండదని సింగరేణి కార్మిక గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య సోమవారం తెలిపారు. సింగరేణి యాజమాన్యం గుర్తింపు సంఘంతో నిర్వహించిన స్ట్రక్చర్ సమావేశంలో పలు కార్మికుల సమస్యలపై ఒప్పందం చేసుకోవడం జరిగిందని సీతారామయ్య తెలిపారు. 150 మస్టర్ల గైర్హాజరుపై అధికారుల ఒత్తిడి ఉండదు. సొంతింటి పథకం సమస్యను తొందరలోనే పరిష్కరించుటకు అంగీకారం కుదిరింది. హైదరాబాద్ లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం టెండర్ ప్రక్రియ పూర్తయినది. తొందరలోనే పనులు ప్రారంభమవుతాయి....