17.5 C
Munich
Tuesday, July 28, 2026

Srisailam : శ్రీ శైలం హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Srisailam : మహా శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని శ్రీ శైలం మల్లికార్జున స్వామిని దర్శించుకోడానికి భక్తులు పెద్ద ఎత్తున శ్రీ శైలం తరలి వచ్చారు. భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించి, తమ మొక్కులు తీర్చుకున్నారు. కోరిన కోరికలు తీరడంతో భక్తులు మల్లికార్జున స్వామి కి కానుకలు సమర్పించారు.

16 రోజుల పాటు మహాశివరాత్రి పండుగ పురస్కరించుకొని బ్రహ్మోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్బంగా శ్రీ శైలం దేవస్థానంకు రికార్డ్ స్థాయిలో హుండీ ఆదాయం వచ్చిందని దేవస్థానం కమిటీ అధికారులు ప్రకటించారు. హుండీ ఆదాయం 5 కోట్ల 69 లక్షల 55 వేల 456 రూపాయలు లభించినట్లు శ్రీశైలం మల్లికార్జున స్వామి అధికారులు ప్రకటించారు.

హుండీ లెక్కింపులో భాగంగా 87 గ్రాముల 500 మిల్లి గ్రాముల బంగారం, యుఎస్ఏ డాలర్లు 885, యూఏఈ దిర్హమ్స్ 105, యూకే పౌండ్స్ 80, సింగపూర్ డాలర్లు 2, కెనడా డాలర్లు 5 తో పాటు నగదు ను భక్తులు కానుకల రూపంలో సమర్పించారని శ్రీశైలం ఈఓ శ్రీనివాస రావు ప్రకటించారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.