NIGAMA MEDIA (P) LTD
13.3 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, September 13, 2026

Education : ప్రాథమిక విద్యనే విద్యార్థికి పునాది

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Education : ప్రాథమిక దశలో పాఠశాలలో చేరిన ప్రతి విద్యార్థికి ప్రాథమిక విద్యనే పునాదితో సమానమని సింగరేణి కాలరీస్ శ్రీరామ్ పూర్ ఏరియా జనరల్ మేనేజర్ బి సంజీవ రెడ్డి స్పష్టం చేశారు. మంచిర్యాల పట్టణంలోని జన్మ భూమి నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన “ఎథిక్ అకాడమీ ద ఎలిమెంటరీ స్కూల్ ” ను సంజీవ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన పాఠశాల విద్యార్థులను, వారి తల్లి దండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రాథమిక స్థాయిలో నాణ్యమైన విద్యను బోధించిన నేపథ్యంలో ప్రతి విద్యార్ధి అందనంత ఎత్తుకు ఎదుగుతాడనున్నారు. అదేవిదంగా తల్లిదండ్రుల లక్ష్యం కూడా నెరవేరుతుందన్నారు.

విద్యార్ధి చదువు విషయంలో తరగతులు బోధించే ఉపాధ్యాయులకు ఎంత భాద్యత ఉంటుందో, తల్లిదండ్రులకు కూడా అంతే భాద్యత ఉంటుందన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమానంగా భాద్యత నెరవేర్చినప్పుడే విద్యార్ధి దేశానికి ఉపయోగపడే విదంగా తయారవుతాడన్నారు. విద్యార్థికి ఇష్టమైన కోర్సు చదివడానికే ప్రోత్సహించాలి, కానీ తల్లి దండ్రులకు ఇష్టమైన కోర్సు చదవాలని ఒత్తిడి చేయరాదన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలు సేవా దృక్పథంతో నిర్వహించాలి. వ్యాపార ధోరణితో నిర్వహించడం సరికాదన్నారు.

అదే విదంగా మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య మాట్లాడుతూ ప్రైవేట్ విద్యాసంస్థలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటా మన్నారు. మున్సిపల్ పరిధిలో విద్యా రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రతి ప్రభుత్వ అధికారి సిద్ధంగానే ఉన్నారన్నారు. ఏదయినా సమస్య ఉంటె ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు తన దృష్టి కి తీసుకు వచ్చిన నేపథ్యంలో పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ రమణ, డాక్టర్ ఎన్ మల్లేష్ , మెడికల్ అసోసిషన్ ప్రెసిడెంట్ టి సుధాకర్, పాఠశాల కరస్పాండెంట్ లక్ష్మి రెడ్డి, ఉపాధ్యాయులు, తల్లి దండ్రులు, మంచిర్యాల బార్ అసోసియేషన్ సభ్యులు, జన్మభూమినగర్ కాలనీ కార్యవర్గం, తదితరులుపాల్గొన్నారు

 

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.