16.6 C
Munich
Monday, July 27, 2026

Singareni : సింగరేణి కార్మికుల ఓట్లే పెద్దపల్లికి కీలకం

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Singareni : పెద్దపల్లి పార్లమెంట్ నియోజక వర్గం నుంచి గెలుపొందడం మూడు పార్టీలకు కీలకమైనది. ముందు నుంచి అక్కడ ఎవరు పోటీచేస్తారు అనేది నియోజకవర్గంలో చర్చ జరిగింది రాజకీయ వర్గాల్లో. ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు, ఎవరికీ టికెట్ వస్తుంది, ఏ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి అంటూ అన్ని పార్టీ శ్రేణుల్లో చర్చకు తెరలేసింది. ఎట్టకేలకు భారత రాష్ట్ర సమితి నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, భారతీయ జనతా పార్టీ నుంచి గోమాస శ్రీనివాస్, కాంగ్రెస్ నుంచి గడ్డం వంశీ బరిలో నిలిచారు.

గడ్డం వంశీ పెద్దపల్లి నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన రాజకీయ నాయకుల దృష్టి పడింది. వంశీ మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకట స్వామి మనవడు, ప్రస్తుత చెన్నూర్ ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి కుమారుడు కావడం విశేషం. ఇప్పుడు వంశీని గెలిపించుకోవడం వివేక్ వెంకట స్వామి కి ప్రధానమైనది. అదేవిదంగా వంశీని ఓడించడం కూడా బీజేపీ తోపాటు బిఆర్ఎస్ నేతలకు కూడా అంతే ప్రధానమైనది.

చెన్నూర్ ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకట స్వామి కాంగ్రెస్ నుంచి బిఆర్ఎస్, బిఆర్ఎస్ నుంచి బీజేపీ, బీజేపీ నుంచి పుట్టినిల్లు అయిన కాంగ్రెస్ కండువా కప్పుకోవడం జరిగిపోయింది. తాజా ఎన్నికల్లో చెన్నూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వివేక్ గెలుపొందారు. అప్పటి నుంచే ఆయన తన కొడుకు వంశీకి కాంగ్రెస్ టికెట్ తెచ్చుకోవడం, గెలిపించుకోవడం కోసం ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ వస్తున్నారు. ఎట్టకేలకు టికెట్ సాధించుకున్న వివేక్ కు ఇప్పుడు కొడుకు గెలుపు భారం కూడా పడింది. వంశీ కి టికెట్ రావడంతో ఒకే ఇంటి నుంచి ముగ్గురికి రాజకీయ ఉద్యోగం రావడంతో ఒకే కుటుంబానికే ఎలా అవకాశాలు ఇస్తారనే గుసగుసలు మొదలైనాయి. ఈ గుస,గుసలను వివేక్ తన రాజకీయ ప్రతిభతో ఎక్కడికక్కడ కట్టడి చేసుకుంటూ వస్తున్నారు.

బిఆర్ఎస్ , బీజేపీ పార్టీలో చేరి ఆ తరువాత వివేక్ వెంకట స్వామి కాంగ్రెస్ లో చేరారు. ఈ నేపథ్యంలో ఆ రెండు పార్టీల్లో సముచిత స్థానం కల్పించినప్పటికీ వివేక్ పార్టీ వీడారు. దీనితో ఆయా పార్టీల అగ్రనేతలకు వివేక్ కుమారుడు వంశీ ఓటమినే లక్ష్యముగా చేసుకున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగ ఉన్నారు. ఏడుగురిలో ఒకరు వంశీ పెద్దనాన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, మరొకరు చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ తండ్రి. ఈ ఇద్దరికీ వంశీని గెలిపించుకోవడం ప్రతిష్టాత్మకమైనది.

పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో సింగరేణి కార్మికుల ఓట్లే కీలకమైనవి. ఈ నియోజకవర్గం లో బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్, రామగుండము ఏరియాలో కార్మికులు 21,000 మంది ఉన్నారు. వీరితోపాటు, వీరి కుటుంబాల ఓట్లు గెలుపు, ఓటమిలను శాసించేవిదంగా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ, సింగరేణి యూనియన్ ఎన్నికల నాటికీ వచ్చే సరికి పార్టీ అనుబంధ సంఘం INTUC చతికిల పడిపోయింది. కేవలం మంథని నియోజకవర్గం పరిధిలోని ఆర్ జి – 3 ఏరియాలో మాత్రమే యూనియన్ గెలుపొందింది. మిగతా అన్ని ఏరియాల్లో సీపీఐ అనుబంధ సంఘమైన ఏఐటీయూసీ విజయం సాధించింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో సీపీఐ సహకారం కూడా ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి కుమారుడు వంశీ గెలుపు కోసం అవసరం ఏర్పడింది.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.