TTD : తిరుమల – తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు వేయి కళ్ళతో ఎదురు చూస్తారు. ఆ స్వామి వారి దర్శనం జీవితంలో ఒక్కసారైనా కలగాలని కోరుకుంటారు. స్వామి దర్శనంకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో, స్వామి ప్రసాదానికి (లడ్డు) కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు భక్తులు. దర్శనం అనంతరం ప్రసాదం కూడా కావాలని ఆ తిరుమల,తిరుపతి వెంకటేశ్వర స్వామిని కోరుకుంటారు.
దేశంలోని అనేక ప్రాంతాల నుంచి భక్తులు ఆ ఏడుకొండలవాడిని దర్శించుకోవాలని తరలి వస్తారు. తిరుమల,తిరుపతి కి రైల్,బస్సుతో పాటు ఇతర వాహనాల ద్వారా తిరుమల చేరుకుంటారు. కానీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం కొందరు నేరుగా కొండపైకి చేరుకుంటారు. మరికొందరు మెట్ల ద్వారా నడిచి వెళుతారు.
మెట్ల ద్వారా వెళ్లే భక్తులు ఎన్ని మెట్లు ఎక్కి వెళుతారు. ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో చాలా మంది భక్తులకు తెలియదు. వెంకటేశ్వర స్వామి దర్శనం కు వెళ్ళడానికి అలిపిరి నుంచి మెట్ల ద్వారా వెళ్ళాలి. మొత్తం మెట్లు 3550 ఉన్నవి. దూరం 9 కిలో మీటర్లు. ఏడు కొండలు, నాలుగు గోపురాలు. వీటన్నిటిని దాటుకొని భక్తులు కలియుగ అవతార పురుషుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని, ప్రసాదం స్వీకరిస్తారు.