Home » Shiva .. Shiva : 3 అంకెతో శివునికి ఏమిటి సంబంధం

Shiva .. Shiva : 3 అంకెతో శివునికి ఏమిటి సంబంధం

Shiva .. Shiva ..తలపై గంగ…మెడలో పాము… ఒంటిపై పులి చర్మం… చేతిలో త్రిశూలం….మరో చేతిలో డమరుకం… మాసిన జుట్టు… వెంట గోమాత… స్మశానములో తిరగటం ఇది ఆ ముల్లోకాలకు అధిపతి అయిన బోళాశంకరుడి రూపం. అంత పెద్ద అధిపతికి మూడు అంకెతో ఉన్న సంబంధం ఏమిటి అనేది భక్తులకు పెద్ద ప్రశ్న. సంఖ్యా శాస్త్రం ప్రకారం మూడు అంకె కూడా శుభమని చెబుతోంది. అయినప్పటికీ శివునికి 3 అంకెతో ఉన్న సంబంధం ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

సంఖ్యా శాస్త్రం ప్రకారం ఒక రోజును నాలుగు జాములుగా విభజించారు. నాలుగు జాములలో మూడవ జాము ఒకటి. మూడవ జాము అంటే సాయంత్రం. ఈ సాయంత్రం కాలం అంటే శివునికి చాలా ఇష్టం. ఈ కాలాన్ని ప్రదోష కాలమని కూడా పిలుస్తారు. ఈ మూడవ జామున శివుణ్ణి పూజిస్తే శుభం కలుగుతుందని వేదం చెబుతోంది. అదేవిదంగా శివునికి ఇష్టమైన బిల్వ పత్రానికి కూడా మూడు ఆకులే ఉంటాయి.

దేవ లోకంలో ముగ్గురు రాక్షసులు కలిసి ఎగిరే పట్టణాలను మూడింటిని ఏర్పాటుచేశారు. ఆ పట్టణాల్లో వాళ్ళు తిరుగులేని విదంగా తయారయ్యారు. ఆ మూడు పట్టణాలకు త్రిపుర అని నామకరణం చేశారు. దేవలోకంలో ధ్వంసం చేసి ఆ పట్టణాలకు తిరిగి వెళ్ళిపోయేవారు. నష్టం చేస్తున్న రాక్షసులను ఎవరు ఏమి చేయలేక పోతున్నారు. రాక్షసుల వలన దేవతలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఒకే ఒక్క బాణంతో మూడు నగరాలను ధ్వంసం చేయవచ్చు. దేవతలందరూ శివుడిని వేడుకున్నారు. శివుడు బాణంగా మారి మూడు నగరాలపై బాణం వేశాడు. దీనితో ఆ మూడు పట్టణాలు క్షణాల్లో బూడిద అయ్యాయి. ఆ బూడిదను శివుడు తన ఒంటికి రాసుకున్నాడు. అప్పటినుంచి శివుడిని త్రిపురారి అనికూడా పిలుస్తారు. ఆ విదంగా శివునికి మూడు అంకెకు ప్రాధాన్యత ఏర్పడింది.

శివుని చేతిలో త్రిశూలం. మూడు అంచులు ఉన్న ఏకైక ఆయుధం. ఇందులో ఆకాశం, భూమి, పాతాళం కలిసి ఉంటాయి. అంతే కాదు త్రిశూలంలో తామసిక, రాజసిక, సాత్విక అనే మూడు గుణాలు ఉంటాయి. కాబట్టి శివునికి మూడు అంకెతో సంబంధానికి ఇది ఒక కారణం. శివుడికి మూడు కళ్ళు ఉంటాయి. అందుకే ఆయనను త్రినేత్రుడు అని కూడా అంటారు. ఆయనకు ఆగ్రహం వచ్చినపుడు మూడో కన్ను తెరుస్తాడు. ప్రయోజనం, మనస్సు, ఆనందం, సత్యం, మంచి స్పృహ, తృప్తికరమైన ఆనందం ఈ మూడు కళ్ళకు అర్థం.

శివుని నుదుటిపై విబూది తో మూడు రేఖలు గ అలంకరణ చేస్తారు. వీటిని త్రిపుండ్రాలు అని కూడా భక్తులు పిలుస్తారు. ఈ త్రిపుండ్రాలకు స్వీయ సంరక్షణ, స్వీయ ప్రచారం ఉంటాయి. ఈ మూడు రేఖలు వ్యక్తి యొక్క సృష్టి, అభివృద్ధి, రక్షణ కు చిహ్నం. కాబట్టి శివుడికి మూడు అంకెతో ఈ విదంగా సంబందం ఉందని శివ పురాణంలో చెబుతుంది.

 

 

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *