Lucky Fellows : నిద్రలో వచ్చే కళలు భవిష్యత్తుకు దారి చూపుతాయని స్వప్న శాస్త్రం చెబుతోంది. కొన్ని కళలు శుభానికి సంకేతాలు. మరికొన్ని అశుభానికి కూడా ముందే హెచ్చరిస్తాయని స్వప్న శాస్త్రంలో పొందుపరిచి ఉంది. కానీ పురుషులకు, స్త్రీ లకు వచ్చే కలల ఫలితాలు మాత్రం ఒకే విదంగా ఉండవు. ఇద్దరి ఫలితాలు వేరువేరుగా ఉంటాయి. మహిళలకు అత్యంత ఇష్టమైనవి బంగారం, వజ్రాలు, వెండి. ఇవి కొన్నిసార్లు కలలో కనిపిస్తాయి.
గాఢ నిద్ర పోయేవారు కలలు కంటూ ఆనందంగా ఉంటారు. కలలో కూడా డబ్బు సంపాదించాలని కోరు కుంటారు. పలు సందర్భాల్లో గోతిలో అకస్మాత్తుగా పడిపోయినట్టు కలకంటారు. మరికొందరు పాములు, తేళ్లు వెంటబడినట్టుగా కళలు వస్తాయి. కలలు కనడం సహజమైన ప్రక్రియ. శాస్త్ర ప్రకారం కలలు వివిధ రకాలకు గుర్తు.
వజ్రాలు లేదా వజ్రాలతో తాయారు చేసిన నగలు కలలో కనిపిస్తాయి. ఇలాంటివి కనిపిస్తే అవివాహిత మహిళలు ఉన్నత స్థాయి అధికారితో వివాహం ఖాయం అవుతుంది. లేదంటే ధనవంతుడైన వ్యాపారవేత్త తో వివాహం జరుగుతుందని శాస్త్రంలో ఉంది.
అవివాహితురాలైన వారికి కలలో అందమైన పక్షులు కనపడితే ప్రేమ వివాహం కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబోయే భర్త భవిష్యత్తులో ధనవంతులు కాబోతున్నారని అర్థం.
మంచం మీద పడుకున్నట్టుగా స్త్రీ కలలో కనబడితే ఆమె చాలా అదృష్టవంతురాలు. జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోడానికి అవకాశాలు ఉన్నాయి. తొందరలోనే పెళ్లి ముహూర్తం కుదిరే అవకాశం కూడా ఉంది.
కలలో యువతికి పనిచేస్తున్న కార్మికుడు కనిపిస్తే ప్రేమను చూపే వరుడు భర్తగా దొరుకుతాడని వేదంలో ఉంది.