Sivaratri : మహా శివరాత్రి పర్వదినం. ఏంతో పవిత్రమైనది. భక్త జనమంతా నదుల్లో పుణ్యస్నానాలు చేస్తారు. శివ పార్వతులకు ఉపవాస దీక్షతో పూజలు చేస్తారు. జాగరణ చేసి తమ భక్తిని చాటుకుంటారు. మరి కొందరు శివ పార్వతుల కళ్యాణం చేసి తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఈ విదంగా వివిధ పద్ధతుల్లో శివ రాత్రి పండుగ భక్తితో ముగుస్తుంది. కానీ ఆ రోజు కేవలం మూడు రాసుల వారికి అదృష్ట యోగం ఉంది. ఆ రాశుల వారు పట్టిందల్లా బంగారమే అవుతుందని వేద పండితులు చెబుతున్నారు.
సింహ రాశి ….. ఈ రాశి తో జన్మించిన వారు ప్రైవేట్ సంస్థల్లో నియామకం అయిన వారికి జీతభత్యాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఏదయినా వాహనం కూడా కొనడానికి అవకాశం ఉంది. చేసే పనికి భార్య సహకారం ఉంటుంది. వ్యాపారస్తులకు ఆదాయ మార్గం పెరిగే అవకాశం కూడా ఉంది.
మేష రాశి….. ఈ రాశిలో జన్మించిన వారికి శివరాత్రి నుంచి అదృష్ట యోగం కలిసి వస్తుంది. ఉద్యోగంలో భాద్యతలు పెరుగుతాయి. వేతనాలు కూడా అనుకూలంగా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు శివరాత్రి నుంచి అనుకూలమైన వాతావరణం. దీర్ఘ కాలిక సమస్యలు పరిస్కారం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.
మిథున రాశి…… ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు శివరాత్రి నుంచి కలిసి వస్తుంది. ఆ రాశి వారు వ్యాపారం కూడా మొదలుపెట్టవచ్చు. ఉద్యోగస్తులకు పదోన్నతులు వచ్చే అవకాశం కూడా ఉందని వేదపండితులు చెబుతున్నారు. విడిపోయిన కుటుంబ సభ్యులు కలిసే అవకాశం కూడా ఉంది.