One Yatra equal to 100 Yagnas : ఆషాడ శుద్ధ విదియ ముహూర్తాన తన అన్న చెల్లెలుతో కలిసి పూరి జగన్నాధుడు రథాలమీద విహరిస్తారు. జగన్నాధుడు తన అన్న, చెల్లెలు అయినటువంటి సుభద్ర, బలరాముడుతో కలిసి ప్రతి ఏటా గర్భగుడి నుంచి వచ్చి భక్తులను ఆశీర్వదిస్తాడు. ఆ నాథుడిని ఉరేగించడానికి ప్రతి సంవత్సరం కొత్త రథాలను తయారు చేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన ఈ రథయాత్రను చూడడానికి రెండు కళ్ళు చాలవు. ఈ రథ యాత్రలో పాల్గొంటే వంద యజ్ఞాలు చేసినట్టు. వంద యజ్ఞాలు చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, అంత పుణ్యం రథయాత్రలో పాల్గొంటే వస్తుందని నమ్మకం.
జగన్నాథుని రథాన్ని లాగితే అదృష్టం. ఈ రథం ఒక్కొక్క అంగుళం చొప్పున మాత్రమే నెమ్మదిగా కదులుతుంది. రథయాత్రకు ఉపయోగించే తాడును పాముకు గుర్తుగా భక్తులు భావిస్తారు. రథం యొక్క ప్రతి భాగం కూడా చాలా పవిత్రమైనది. అందుకే రథాన్ని లాగే అవకాశం దొరకక పోయినా కనీసం ఆ జగన్నాధుడు కొలువైన రథాన్ని తాకడం, లేదంటే తాడును అయినా తాకితే ఎంతో పుణ్యం లభిస్తుందని వేదంలో చెప్పబడింది. అందుకే ప్రతి భక్తుడు రథాన్ని లేదా తాడును తాకడానికి ప్రయత్నిస్తాడు. ఎంత కష్టమైన సరే ఆ రెండింటిలో ఎదో ఒకదాని ముట్టుకొని ఆ జగన్నాధుడి ఆశీర్వాదం పొందితేనె భక్తులకు తృప్తి కలుగుతుంది. రథాన్ని తాకడం, లేదంటే తాడును ముట్టుకోవడం మంచి శుభప్రదం. తాడును తాకడం వలన చేసిన పాపాలు ఏమైనా ఉంటె తొలగిపోతాయి. జగన్నాధుడు కొలువైన రథంలో ముప్ఫయ్ మూడు కోట్ల మంది దేవతలు ఉంటారని వేదంలో చెప్పబడింది.
రథంతో పాటు తాడును తాకితే ముప్ఫయ్ మూడు కోట్ల మంది దేవతలను పట్టుకున్నట్టు అవుతుంది. చరిత్ర ఆధారంగా రథాన్ని తాకడం వలన పునర్జన్మ ఉందని భక్తుల నమ్మకం. అందుకే రథాన్ని, తాడునుతాకడానికి ప్రయత్నిస్తారు అక్కడికి వచ్చిన లక్షలాది మంది భక్తులు. తాడు, రథాన్ని పట్టుకోవడం, లాగడం వలన అశ్వమేధ యజ్ఞ ఫలితాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం. పూరి జగన్నాథుని రథం లేదా తాడును తాకితే భక్తికి ప్రతిఫలం, అనుగ్రహం, అపారమైన ఆశీస్సులు కురుస్తాయని భక్తుల విశ్వాసం.
జగన్నాథుని రథాలను తయారు చేయడానికి వేప కర్రను వసంత పంచమి రోజున ఎంపిక చేస్తారు. వేప కర్రతో మాత్రమే రథాన్ని తయారు చేస్తారు.రథం తయారు చేయడానికి వడ్రంగులు ఇనుప వస్తువులను వాడరు. కర్రతో తయారు చేసిన వస్తువులతోనే తయారు చేస్తారు. అదేవిదంగా రథం తయారు చేయడానికి ఇనుము మొలలు వంటివి కూడా వాడారు. పూర్తిగా కర్రతో తయారవుతుంది రథం. అక్షయ తృతీయ రోజున రథాన్ని తయారు చేసే పని ప్రారంభమవుతుంది. యాదృచ్ఛికంగా జగన్నాథుని రథానికి 16 చక్రాలు ఉంటాయి
పురాతనం నుంచి వస్తున్న సాంప్రదాయం ప్రకారం రథానికి ముందుగా గజపతి రాజు ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ సమయంలో గజపతి రాజు బంగారు చీపురుతో రథాన్ని శుభ్రం చేసిన తరువాత రథం వెళ్లే మార్గాన్ని కూడా అదే చీపురుతో శుభ్రం చేస్తారు. ఆ తరువాత రథయాత్ర ప్రారంభం అవుతుంది.