10 Crores Loss : చిత్ర పరిశ్రమ హీరో, హీరోయిన్స్ తో ప్రైవేట్ వ్యాపార సంస్థలు యాడ్స్ ప్రమోట్ చేస్తాయి. యాడ్స్ లో నటించి నందుకు నటులు అడిగినంత ఇచ్చుకుంటారు. ఎందుకంటే ప్రజల్లో వాళ్లకు ఉన్న క్రేజీ అలాంటిది. కాబట్టి నటీ, నటులు డబ్బుకు,డబ్బు, పేరుకు పేరు సంపాదించుకుంటారు. కొందరు నటీ,నటులు ప్రజలకు మేలు చేసే వాటినే ఎన్నుకుంటారు. కొందరు డబ్బు కోసం ఎలాంటి ప్రకటన అయినా ఒప్పుకొని నటిస్తారు. ప్రజల ఆరోగ్యానికి నష్టం చేసే వాణిజ్య ప్రకటనలు ఒప్పుకొనినటీ,నటులు ఉన్నారు.
పుష్ప మొదటి భాగంతో అల్లు అర్జున్ క్రేజీ పెరిగిపోయింది. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్నాడు. పలు ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలు యాడ్స్ ప్రమోట్ చేసేందుకు పోటీ పడ్డాయి. ఇటీవల కొన్ని వ్యాపార సంస్థలు నటుడు అర్జున్ తో యాడ్స్ కూడా పూర్తి చేసారు. ఒకవైపు ఒప్పుకొన్న సినిమాలు, మరోవైపు వ్యాపార సంస్థల ప్రకటనల్లో నటిస్తూ అల్లు అర్జున్ క్షణం తీరిక లేకుండా ఉన్నారు. తాజాగా బన్నీ ఉత్తర భారత దేశంలో కూడా క్రేజీ సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆయన తమ వ్యాపార సంస్థల ప్రకటనల కోసం నటించాలని కోరుతూ ఇంటిముందర పడిగాపులు కాస్తున్నారు. తన వద్దకు వచ్చిన ప్రైవేట్ సంస్థల వాణిజ్య ప్రకటనల్లో నటించడానికి ఒప్పుకుంటున్నారు అల్లు అర్జున్. కానీ ఒక సంస్థ రూ: 10 కోట్లు ఇస్తాం, మా కంపెనీ ప్రకటనలో నటించాలని కోరింది. ఆయన ఆ పది కోట్ల అఫర్ ను సున్నితంగా తిరస్కరించారు. ఇంతకూ ఆ సంస్థ ఏమిటంటే…
ఒక పొగాకు కంపెనీ సంస్థ వాణిజ్య ప్రకటనలో నటించాలని కోరింది. అందుకు పది కోట్ల రూపాయల అఫర్ ఇచ్చింది. పొగాకు సంస్థ కావడంతో ఆ సంస్థను సున్నితంగా తిరస్కరించారు అల్లు అర్జున్. పొగాకు, మద్యం, గుట్కా వలన ప్రజల ఆరోగ్యం చెడిపోతుంది. అటువంటి వాటిలో నటిస్తే ప్రజలను ఇబ్బందులకు గురిచేసినట్టు అవుతుంది. అందుకనే అల్లు అర్జున్ పొగాకు సంస్థలో నటించకుండా వచ్చిన పది కోట్ల రూపాయల అఫర్ ను సున్నితంగా తిరస్కరించారు.