Home » Danam : సంక్రాంతికి దానం చేసే సమయం ఎప్పుడో తెలుసా ?

Danam : సంక్రాంతికి దానం చేసే సమయం ఎప్పుడో తెలుసా ?

Danam : వేద పంచాంగంలో చెప్పబడిన ప్రకారం ధనుస్సు రాశిని వదిలిపెట్టి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ రోజున హిందూ కుటుంబాలు మకర సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల పేర్లతో ఈ పండుగను పిలుస్తారు. రకరకాల సంప్రదాయాలతో జరుపుకుంటారు. సమీపంలోని పుణ్యనదుల్లో ఒకరోజు ముందుగానే స్నానాలు చేసి నది దేవతలకు పూజలు చేస్తారు.

వేదంలో చెప్పబడిన ప్రకారం శుభ సమయంలోనే స్నానాలు పూర్తి చేయాలి. జనవరి 14న ఉదయం తొమ్మిది గంటల లోపు కుటుంబ సభ్యులందరు స్నానాలు పూర్తి చేసుకోవాలి. మహా పుణ్యకాలం ఉదయం 10.03 గంటలకు ప్రారంభమై, రాత్రి 10.48 గంటలతో ముగుస్తుంది. దాన ధర్మాలు చేయడానికి ఈ మహా పుణ్యకాలంలోనే పూర్తి చేసుకోవాలని వేదంలో చెప్పబడింది.

ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, దుప్పట్లు దానం చేయవచ్చు. అదే విదంగా అనాధ ఆశ్రమాల్లో వృద్దులకు కావలసిన వస్తువులు, బట్టలు, దుప్పట్లు దానం చేయడం ఉత్తమమని వేద పండితులు చెబుతున్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *