Pooja : ఈ రోజుల్లో ఇళ్లు కట్టుకునేవారు ప్రత్యేకంగా పూజ గదిని కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. గది ఏర్పాటులో ఖర్చు కూడా భారీగానే పెడుతున్నారు. నిర్మాణంలో పాలరాతి, ఖరీదయిన కర్రతో నిర్మాణం చేపడుతున్నారు. గదిలో కూడా పూజ కోసం వెండి వస్తువులనే కొనుగోలు చేస్తున్నారు. నిత్యం విద్యుత్ దీపాలను వాడుతున్నారు. ప్రతిరోజూ పూలతో అలంకరించే వారు సైతం ఉన్నారు. రోజూ ఉదయం, సాయంత్రం దీపారాధన చేసి నైవేద్యం పెడుతారు. కానీ పూజ గదిలో రాక్ సాల్ట్ మాత్రం పెట్టరు. కొందరు మాత్రమే పెడుతారు. తెలియని వారు పెట్టరు. కానీ పూజ గదిలో రాక్ సాల్ట్ పెడితే ఇంటి కుటుంబ సభ్యులకు ఆరోగ్యం, ఐశ్వర్యం, సిరిసంపదలకు ఎలాంటి లోటు ఉండదని వేద పండితులు చెబుతున్నారు.
రాక్ సాల్ట్‌ను ఐశ్వర్యానికి సూచికగా భావిస్తారు.
ప్రతికూల శక్తులను తొలగించి సానుకూల శక్తిని ప్రవేశపెడుతుంది.
పూజ గదిలో ఎల్లప్పుడూ మట్టికుండ పాత్రలోనే పెట్టాలి.
మట్టి కుండలో పెట్టిన రాక్ సాల్ట్ ను కుడి చేతివైపుకు పెట్టుకోవాలి.
మట్టి కుండను సాయంత్రం ఆరు గంటల లోపు ప్రతి శుక్రవారం లేదా మంగళవారం శుభ్రం చేసుకోవాలి .
కొత్త ఎర్రని వస్త్రంలో రాక్ సాల్ట్ ను కట్టి ఇంటి గుమ్మం వద్ద కడితే ఇంటికి దిష్టి తగలదు.
రాక్ సాల్ట్, పసుపు, కుంకుమ, మహాలక్ష్మి అనుగ్రహానికి సూచికలు.