Hanman : శ్రీరాముడి భక్తుడు హనుమంతుడి జన్మదినోత్సవాన్ని దేశవ్యాప్తంగా భక్తులు ఘనంగా జరుపుకుంటారు. జన్మదినోత్సవం పురస్కరించుకొని పూజించిన వారికి కష్టాలు తొలగిపోతాయని హిందూ భక్తుల్లో నమ్మకం ఉంది. కోరికలు కూడా నెరవేరుతాయి. అంతే కాదు ఈ విషయాన్ని వేదంలో కూడా చెప్పబడింది. హనుమంతుడి జయంతి ఎప్పుడు వస్తుంది. ఆ రోజు ఎలాంటి పూజ చేయాలి అనే విషయాన్ని వేదంలో ఈ విధంగా చెప్పబడింది.
వేద పంచాంగంలో చెప్పబడిన ప్రకారం హనుమాన్ జయంతిని చైత్ర మాసం పౌర్ణమి తిధిలో ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది చైత్ర మాసం పౌర్ణమి తిధి ఏప్రిల్ 12వ తేదీ తెల్లవారుజామున 3:21 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిధి మర్నాడు ఏప్రిల్ 13న ఉదయం 5:51 గంటలతో ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం హనుమాన్ జన్మదినోత్సవాన్ని ఏప్రిల్ 12న జరుపుకోవాలని వేదంలో చెప్పబడింది.
హనుమాన్ జయంతి పురస్కరించుకొని హనుమంతుడితో పాటు సీతా రాములను పూజించాలి. హనుమంతునికి ప్రసాదంగా సింధూరం, ఎర్రటి పువ్వులు, తులసి దళాలు, శనగలు, ఏదయినా తియ్యటి ప్రసాదం నైవేద్యంగా సమర్పించాలి. హనుమాన్ చాలీసా చదవాలి. చివరగా కొబ్బరికాయ కొట్టి, నైవేద్యంగా పెట్టిన వాటిని కుటుంబ సభ్యులకు పంచిపెట్టండి. దింతో హనుమాన్ పూజ ముగుస్తుంది.