Home » Bed room : బెడ్ రూమ్ లో దేవుడి ఫొటో ఉంటె ఏమవుతుంది ?

Bed room : బెడ్ రూమ్ లో దేవుడి ఫొటో ఉంటె ఏమవుతుంది ?

Bed room : ఈ రోజుల్లో కొత్తగా నిర్మాణమవుతున్న ఇంటిలో ప్రత్యేకంగా పూజ గదిని నిర్మిస్తున్నారు. అందులోనే ఇంటి దేవత తో పాటు నచ్చిన దేవుళ్ళ ఫోటోలను పెట్టుకుంటున్నారు. ఆ పూజ గదిలోనే పూజలు చేస్తున్నారు. డైనింగ్ హాల్, కిచెన్, విజిటర్స్ హాల్, హాల్ లో కూడా కొందరు వివిధ దేవుళ్ళ ఫోటోలను పెడుతున్నారు. కానీ చాలా మందికి ఒక అనుమానం ఉంది. వాస్తవానికి బెడ్ రూమ్ లో దేవుడి ఫోటో ఉండవచ్చా, ఉండరాదా , ఉంటె ఏమవుతుంది అనే సందేహాలు చాలా మందిలో ఉన్నవి. వేదంలో ఇలా చెప్పబడింది…..

పడక గది అనేది వాస్తవానికి అది ఒక శయన మందిరం. అందులో పూజా కార్యక్రమాలు నిర్వహించరాదు. ఉదయాన్నే నిద్ర లేచిన తరువాత దేవుడి దర్శనం చేసుకోవాలనుకోవడం సహజం. అందుకోసం బెడ్ రూమ్ లో దేవుడికి సంబందించిన క్యాలండర్ వంటివి గోడకు తగిలించుకోవచ్చు.

కానీ పూజ గదిలోని దేవతలకు సంబంధించిన విగ్రహాలను, ఫోటోలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోరాదని వేదంలో చెప్పబడింది. దేవుడికి సంభందించిన ఫోటోలు, విగ్రహాలకు నిత్యం మనం పూజలు చేస్తాం. కాబట్టి వాటిని పూజ గదికే పరిమితం చేయాలనీ వేదం పండితులు కూడా చెబుతున్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *