Home » ఇబ్బందిగా మారిన బ్యాంకు సెలవులు

ఇబ్బందిగా మారిన బ్యాంకు సెలవులు

BANK : నిబంధనల మేరకు మే నెలలో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు వస్తున్న సెలవులు వినియోగదారులకు ఇబ్బందిగా మారాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సెలవు రోజుల్లో అత్యవసరంగా పెద్ద మొత్తంలో డబ్బు అవసరం ఉన్న వారికో కొంత మేరకు ఇబ్బంది అవుతుంది. ఆదేవిందగా అప్పటికప్పుడు కూడా సెలవు దినాల్లో బంగారం తాకట్టు పెట్టి ఋణం తీసుకోవాలని అనుకునే వినియోగదారులకు కూడా సమస్య తప్పదు. కాబట్టి వినియోగదారులు ముందుగా వస్తున్న సెలవులను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్త పడితే కుటుంబ పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని పలువురు బ్యాంకు అధికారులు చెబుతున్నారు.

మే 1-బుధవారం – ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్బంగా దేశంలో బ్యాంకులన్నింటికి సెలవు
మే 5- ఆదివారం- బ్యాంకులన్నిటికి సాధారణ సెలవుగా పరిగణిస్తారు.
మే 10-శుక్ర వారం- అక్షయ తృతీయ కాబట్టి దేశంలోని బ్యాంకులు సెలవులు పాటిస్తాయి
మే 11-శనివారం -రెండో శనివారం కాబట్టి ఈ రోజు కూడా సాధారణ సెలువు
మే 23-ఆదివారం -బ్యాంకులకు సాధారణ సెలవు
మే 25-శనివారం-నాలుగో శనివారం ఈరోజు సాధారణ సెలవు
మే 26- ఆదివారం-ఆదివారం కాబట్టి సాధారణ సెలవు
మే 13-తెలంగాణ లో లోకసభ నాలుగో దశ పోలింగ్ కాబట్టి ఆరోజు బ్యాంకులకు సెలవు.

మే నెలలో తెలంగాణ లో ప్రభుత్వ,ప్రైవేట్ బ్యాంకు లన్ని కూడా సెలవు పాటిస్తాయి. మొత్తం ఎనిమిది రోజులు సెలవులు వస్తున్నాయి. అయినప్పటికిని మొబైల్ బ్యాంకు, ఇంటర్నెట్ బ్యాంకు సేవల ద్వారా లావాదేవీలను వినియోగదారులు యధావిధిగా నిర్వహిచుకోవడనికి అవకాశం ఉంది. వీటితోపాటు యూపీఐ, ఏటీఎం సర్వీస్ కూడా యధావిధిగా కొనసాగనున్నాయి. బ్యాంకు అవసరం లేకుండానే లావా దేవీలను కొనసాగించడానికి అవకాశాలు ఉన్నాయి
—————————-
ఎడిటర్: పీఆర్ యాదవ్
9603505050
—————————-

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *