కోల్ బెల్ట్ ప్రతినిధి:
అభిజిత్ ముహూర్తాన శ్రీరాముడి కళ్యాణం ప్రతిఏటా జరుగుతుంది.అసలు ఈ ముహూర్తం ఏమిటి. ముహుర్తంకు ఉన్న గొప్పతనం ఏమిటి.ఆ ముహూర్తాన కళ్యాణం ఎందుకు జరుపుతున్నారు.వేదం ప్రకారం అశ్విని నుంచి రేవతి వరకు 27 నక్షత్రాలు ఉన్నవి.అభిజిత్ అనేది కూడా ఒక నక్షత్రమే. ఈ నక్షత్రంతో కలిపి మొత్తం 28 నక్షత్రాలని పలువురు వేదపండితులు చెబుతున్నారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతిరోజూ అభిజిత్ ముహూర్తం ఉంటుంది.ఈ ముహూర్తం సర్వదోష నివారణ కు ఎంతో ఉపయోగ పడుతుంది.ఉపయోగపడే ముహూర్తమని ఏపని పడితే ఆ పని చేయకూడదని వేదం స్పష్టంగా చెబుతోంది.
అభిజిత్ కాంతిలేని నక్షత్రం….
అభిజిత్ నక్షత్రం అనేది ఒక కనిపించని చుక్క అనికూడా అనుకోవచ్చు.ఆ నక్షత్రం నుంచి కాంతి వెలువడదు.ఉత్తరాషాఢ నక్షత్రం చివరి పాదం శ్రవణా నక్షత్రంలోని మొదటి పదిహేను ఘడియలను కలిపి అభిజిత్ నక్షత్రంగా పరిగణలోకితీసుకుంటారు. శ్రవణం నారాయణుడి సంబంధం. ఉత్తరాషాఢ నక్షత్రం మహాలక్ష్మి కి గుర్తు.అందుకనే విజయప్రదమని కూడా మరొక పేరుఉంది. మధ్యాహ్నం సమయంలో నాలుగో లగ్నం ను కూడా అభిజిత్ అని కూడా అంటారు.
అభిజిత్ నక్షత్రంకు ఆ పేరు ఎలా వచ్చింది ???
శాస్త్రం ప్రకారం 27 నక్షత్రాలు.ఇవన్నీ కూడా దక్ష ప్రజాపతి కుమార్తెలుగా వేదం చెబుతోంది.27 మంది కుమార్తెలను చంద్రుడికి ఇచ్చి వివాహం చేస్తాడు ప్రజాపతి. అయితే చంద్రుడికి మాత్రం ఒక్క రోహిణి అంటేనే మిగతా భార్యల కంటే ఎక్కువ ఇష్టం. ఎక్కువ సమయాన్ని రోహిణి వద్దనే గడుపుతాడు.అందరు భార్యలు ఈ విషయాన్నీ పెద్దగా పట్టించుకోరు. కానీ రోహిణి మాత్రం అందరిని సమానంగా చూడటం లేదని కోపంతో ఉంటుంది.తనలాగే ఉండే మరొక రూపాన్ని తయారుచేసి తన స్థానంలో వదిలిపెట్టి రోహిణి తన తండ్రివద్దకు వెళుతుంది.ఈ విదంగా శ్రవణం నక్షత్రం వదిలిపెట్టిన మరో రూపం పేరే అభిజిత్.ఆ అభిజిత్ 28వ నక్షత్రంగా అవతరించింది.ఆ నక్షత్రాన్ని అభిజిత్ ముహూర్తం అని శాస్త్రం చెబుతోంది.
అభిజిత్ బలమైన ముహూర్తం …..
అభిజిత్ ముహూర్తంలో వివాహం జరిగింది కాబట్టే కష్టాలు వచ్చాయనేది అబద్దమని శాస్త్రం చెబుతోంది.ఈ ముహూర్తం రోజుననే శ్రీరాముడి జననం,కళ్యాణం జరిగాయి. ఇదే ముహుర్తాన్ని ఎంచుకొని దేవతలు సముద్ర మధనం చేసి విజయం సాధించారు. ఇంద్రుడు ఈ ముహుర్తానికే దేవ సింహాసనాన్ని చేపట్టాడు. భీష్ముడు ధ్యాన స్థితుడై ప్రాణాలను ఇదే ముహూర్తాన వదిలిపెట్టినట్టు చరిత్ర చెబుతోంది.శివుడు ఈ ముహూర్తాన్నే త్రిపురాసుర వద చేసాడని కూడా వేదం చెబుతోంది.అయోధ్యలో రామాలయ నిర్మాణంకు భూమి పూజ ను ఇదే ముహూర్తాన చేసారంటే ఈ అభిజిత్ ముహూర్తం ఎంత బలమైనదో ప్రత్యేకించి చెప్పవలసిన అవసరంలేదు. మధ్యాహ్నం పదకొండు గంటల నలబై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్ఫయి నిమిషాల మధ్య ఉండే ఈ ముహుర్తానికి విజయ ముహూర్తం అనే మరొక పేరు కూడా చరిత్రలో ఉంది.
—————————
ఎడిటర్: పీఆర్ యాదవ్
9603505050
—————————-