2024–2025 శ్రీ క్రోది నామసంవత్సరంలో రాశి ఫలాలు
ఏడాది కాలంపాటు మనల్ని నడిపించేది పంచాంగం
వేద పండితుల పంచాంగం ఆధారంతో
కోల్ బెల్ట్ న్యూస్:మంచిర్యాల
కర్కాటకం రాశి
పునర్వసు 4పాదం,పుష్యమి,ఆశ్లేష
ఆదాయం 14,వ్యయం 2, రాజపూజ్యం 6,అవమానం 6.
విద్యార్థులు చదువులో మంచి ఫలితాలను సాధిస్తారు.వ్యాపారరంగంలో అభివృద్ధి.రైతులకు మేలు జరుగుతుంది.విదేశీయోగం అనుకూలమైతే సద్వినియోగం చేసుకోవాలి.గృహ యోగం ఉంది.ఈ రాశివారికి ఆనందం,ప్రేమ,శాంతి ఏడాది అంతా కూడా ఉంటుంది. అవివాహితులకు ఉత్తమ ఇల్లాలు దొరుకుతుంది.మంచి గుణవంతురాలు. భర్త,పిల్లలతో ఆనందంగా గడుపుతుంది. పిల్లలను మంచి విద్యావంతులను చేస్తుంది. భర్తకు ఆర్థికంగా సహకారం అందిస్తుంది.కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో ప్రధానపాత్ర పోషిస్తుంది.ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు లభిస్తాయి.గురుగ్రహం వలన కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.కేతువు మూడో రాశిలో ఉండటం వలన ఆరోగ్యం,ధనం,పేరుప్రతిష్టలు పెరుగుతాయి.