RTC Notification : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ రాబోతున్నది. ఉద్యోగాలను భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ లో 3035 ఖాళీలు ఉన్నట్టు ఆర్టీసీ సంస్థ ప్రకటించింది.
ఆర్టీసీ ఉన్నతాధికారులు పంపిన నివేదికల ఆధారంగా పోస్టులన్నిటిని భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఖాళీగా ఉన్న 3,035 పోస్టుల్లో 114 డిప్యూటీ సూపరింటెండెంట్(మెకానిక్), 25 డిపో మేనేజర్/అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్, 23 అసిస్టెంట్ ఇంజనీర్(సివిల్), 15 అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్, 84 డిప్యూటీ సూపరింటెండెంట్(ట్రాఫిక్), 11 సెక్షన్ ఆఫీసర్(సివిల్), 7 మెడికల్ ఆఫీసర్(జనరల్),
7 మెడికల్ ఆఫీసర్(స్పెషలిస్ట్), 743 శ్రామిక్, 2,000 డ్రైవర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది. వీటిని భర్తీ చేయడానికి ఆర్టీసీ సంస్థ నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది.
గత తొమ్మిదేళ్లలో ఆర్టీసీ లో నియామకాలు జరుగలేదు. ఇంత పెద్ద మొత్తంలో నోటిఫికేషన్ రాబోతున్న తరుణంలో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. భర్తీ కానున్న పోస్టుల్లో ఇంజనీరింగ్ మెకానికల్ లేదా ఆటో మొబైల్ డిగ్రీ చదివిన వారికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి.