Air India : ఎయిర్ ఇండియా శాఖలో నిరుద్యోగులకు మంచి అవకాశం. ఏదేని డిగ్రీ అర్హత తో దరఖాస్తు చేసుకోడానికి అవకాశం కల్పిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. మంచి వేతనంతో పాటు పలు సౌకర్యాలను కూడా అదనంగా కల్పిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఉద్యోగానికి ఎంపికయిన మొదటి నెలలోనే అన్ని అలవెన్సులు కలిపి సుమారుగా 28,000 వేతనం పొందవచ్చునని ప్రకటనలో తెలిపింది.
ఉద్యోగానికి ఎంపికయిన వారు ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. దరఖాస్తును ఆన్ లైన్ లోనే అందజేయాలి. దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. జూలై 14 చివరి తేదీ. ఎయిర్ పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ ద్వారా నియామకం జరుగుతుంది. వయసు 18 నుంచి 33 ఎల్లా మధ్య ఉండాలి. జనరల్ అభ్యర్థులు 33 ఏళ్ల లోపు ఉండాలి. ఓబిసి అభ్యర్థులు 3 ఏళ్ళు, ఎస్సి, ఎస్టీ అభ్యర్థులు 5 ఏళ్ల సడలింపు ఉంటుంది.
అర్హత గలవారిని రాత పరీక్షకు ఎంపిక చేస్తారు. ఆపరీక్షలో వచ్చిన ప్రతిభ ఆధారంగా ఇంటర్వ్యూకి పిలిచి ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూలో అర్హత సాధించిన వారి సెర్టిఫికెట్లను పరిశీలించి, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వీటన్నిటిలో అర్హత సాధించిన వారిని ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. మొత్తం ఖాళీలు 1049. వేతనం సుమారుగా అన్ని అలవెన్సులు కలిపి రు : 28,000. ఏదేని డిగ్రీ అర్హత. దరఖాస్తు చేసుకునే వెబ్ సైట్ : https://www.aiasl.in/Recruitment