Home » Mla Krishna Rao : కృష్ణ… కృష్ణ…కవితను ఎంత మాటంటివి….

Mla Krishna Rao : కృష్ణ… కృష్ణ…కవితను ఎంత మాటంటివి….

Mla Krishna Rao : గులాబీ శ్రేణులపై ఎమ్మెల్సీ కవిత ఎక్కడో ఒకచోట విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శలను గులాబీ శ్రేణులు తిప్పికొడుతున్నారు. కానీ అందరికంటే ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు ఒక పదం ఎక్కువగానే వాడారు. మంగళవారం కవితపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు ఘాటుగానే ఎదురుదాడికి దిగారు. ఏమాత్రం వెనుకా ముందు ఆలోచించకుండా కవితను కుక్కతో పోల్చారు కృష్ణా రావు. నీ లాంటి కుక్కలు చాలా నా ఇంటి ముందు మొరిగిపోయాయి. అధినేత కేసీఆర్ కూతురు అని కూడా ఆయన ఆలోచించినట్టుగా ఆయన మాటల్లో కనిపించలేదు. హరీష్ రావుపై నిందలు వేసి వెళ్ళగొట్టాలని, సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి అన్నను జైల్లో వేయాలని కవిత కుట్రలు చేస్తోందంటూ కృష్ణా రావు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కుక్కతో సంబోధించడంతో ఇప్పుడు పార్టీలో పెద్ద చేర్చనీయాంశం అయ్యాయి.

హైదరాబాద్ లోని పార్టీ ఎమ్మెల్యేలను కవిత బీటీ బ్యాచ్ అంటూ సంబోధించారు. ఉద్యమ నేపథ్యం లేకుండానే బీటీ బ్యాచ్ పార్టీలో చేరి పదవులు అనుభవిస్తున్నారంటూ కవిత ఆరోపించారు. ఈ విషయం ఎమ్మెల్యే కృష్ణారావు కు ఆగ్రహానికి గురిచేసింది. మేము ఉద్యమం చేయలేదు. కానీ ప్రభుత్వానికి అండగా ఉండి, రాష్ట్రాభివృద్ధికి కృషిచేశామన్నారు. అంతే కానీ నీ మాదిరిగా, నీ భర్త మాదిరిగా వసూళ్లకు పాల్పడలేదు. బట్టల దుకాణం, బంగారం దుకాణం, ఇలా ఎవరిని వదలకుండా వసూలు చేసి, దోచుకున్న నీ బండారాన్ని ఇప్పితే తట్టుకోలేవు అంటూ కృష్ణా రావు ఘాటుగా మాట్లాడటం గులాబీ శ్రేణులకు సైతం ఆశ్చర్యానికి గురిచేసింది.

నీవు ఒక చరిత్ర హీనురాలువు. మేము ఉద్యమం చేయలేదు. ఉద్యమం చేసిన నీవు నీ అత్తగారి ఊరిలో ఎందుకు ఓడిపోయావంటూ ఆయన ప్రశ్నించారు. అధినేత పై ఉన్న అభిమానంతో పార్టీ ఎమ్మెల్యేలు నీ గురించి మాట్లాడటం లేదు. మూడు దఫాలుగా గెలిచిన నన్ను అనే అర్హత నీకు లేదంటూ ఘాటుగా స్పందించారు. ఓవర్ ల్యాప్ భూమిని పార్టీ పేరుతో దక్కించు కున్నావు. బాలా నగర్ లో నీ భర్త చేసిన కబ్జాల చిట్టా కూడా ఉందన్నారు. కుక్కతో పోల్చుతూనే మర్యాదగా మాట్లాడు అంటూ మాధవరం కృష్ణా రావు మాట్లాడిన మాటల వెనుక ఎవరో ఒకరి మద్దతు ఉందంటూ పార్టీ శ్రేణులు కొందరు చెవులు కొరుక్కోవడం విశేషం.
——————————–

సీహెచ్.పరశు రాం,
పొలిటికల్ బ్యూరో,
9603505050.
——————————-

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *