Sri sailam : శ్రీశైలం మల్లికార్జున స్వామిని స్పర్శ దర్శనం చేసుకోడానికి ఆలయం అధికారులు గొప్ప అవకాశాన్ని కల్పించారు. ఇప్పటి వరకు మల్లన్న ఆలయంలోనే టికెట్ తీసుకొని దర్శనం చేసుకునేవారు. కొందరికి ఈ అవకాశం కలుగలేదు. భక్తుల కోరికకు తగ్గట్టుగా అధికారులు కొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు. ఉచిత స్పర్శ దర్శనం చేసుకునే భక్తులు ఒకరోజు ముందుగా ఆన్లైన్ లో టికెట్ తీసుకోవాలని అధికారులు ప్రకటించారు. శ్రీశైలం మల్లికార్జున వెబ్ సైట్ ద్వారా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు అధికారులు.
ఆన్లైన్ లో ఉచిత స్పర్శ దర్శనం టికెట్ తీసుకునే భక్తులు పూర్తి సమాచారాన్ని నమోదు చేయాలి. ఆధార్ నంబర్, పూర్తి పేరు, మోబైల్ నెంబర్ నమోదు చేయాలి. ఆన్లైన్ లో నమోదయిన ప్రింట్ తో పాటు వెంట ఆధార్ కార్డు తీసుకోని స్పర్శ దర్శనానికి రావాల్సిందిగా ఆలయం అధికారులు కోరారు.