60 lakhs oters : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి. జూన్ నాలుగున ఫలితలు వెల్లడికానున్నాయి. పోటీలో నిలిచిన నాయకులు పోలైన ఓట్ల గణాంకాల్లో మునిగిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ కులం వారు ఎవరికి మొగ్గు చూపారు. మైనారిటీలు ఎవరికి అండగా నిలిచారు. మధ్యతరగతి కుటుంబాలు ఎవరికి అండగా నిలిచాయి. సంక్షేమ ఫథకాలు పొందుతున్నవారు ఎవరికి ఓటు వేశారు. ఉన్నత వర్గాల వారు ఎవరిని ఆదరించారు. కూటమి, వైసీపీ, కాంగ్రెస్ అభ్యర్థులు గణాంకాల్లో మునిగిపోయారు. ఓట్ల సరళని బట్టి కొందరు గెలుపు ధీమాలో ఉండగా, మరికొందరు నిరుత్సహానికి లోనయ్యారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో ఎన్నికలు ముగిశాయి. మే 13 న జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 82 శాతం నమోదయినది. 2019 కంటే తాజా ఎన్నికల్లో అధికంగా పోలింగ్ నమోదయినది. ఎక్కువ పోలింగ్ నమోదు కావడంతో కూటమి, వైసీపీ నేతలు ఎవరికి వారే గెలుపు ధీమాలో ఉన్నారు. మా పాలన ప్రజలు మెచ్చే విదంగా ఉండటంతోనే ప్రజలు మరోసారి మేము అధికారంలోకి రావాలనే కోరికతో అధికంగా పాల్గొన్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. వైసీపీ పాలనను తిరస్కరించడానికే ప్రజలు అధిక సంఖ్యలో తరలి వచ్చి కూటమికి ఓటు వేశారని కూటమి నేతలు చెబుతున్నారు.
పోలింగ్ పూర్తయిన తరువాత అభ్యర్థులు లెక్కలు వేయడం సహజం. ఏపీ లో 60 లక్షల ఓటర్లు తాజా ఎన్నికల్లో ఎవరివైపు మొగ్గు చూపారనేది అభ్యర్థులకు అంతుపట్టడంలేదు. దీనితో నాయకులు తలపట్టుకున్నారు. ఈ 60 లక్షల మంది ఓటర్లు అంత కూడా ప్రభుత్వ పతకాలను పొందుతున్నవారే కావడం విశేషం. ఒకవేళ జగన్ పై అభిమానం ఉండి వైసీపీ అభ్యర్థులకే ఓటు వేస్తె మెజార్టీ స్థానాలు వైసీపీ దక్కించుకొని మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉందని రాజకియ పండితులు అభిప్రాయపడుతున్నారు.