mla kousik reddy : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ఎమ్మెల్యే పది కౌశిక్ రెడ్డి విసిరిన బాణం గురితప్పిందనే అభిప్రాయాలు గులాబీ శ్రేణుల్లో వ్యక్తం కావడం విశేషం. చీర, గాజులు చూపిస్తూ చేసిన వ్యాఖ్యలు మహిళల్లో ఆగ్రహం వ్యక్తం అయ్యింది. అయినప్పటికీ గతంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించినప్పటికీ కౌశిక్ రెడ్డి తప్పించుకోలేక పోయారు. తాజాగా కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ కు చీరలు పంపుతానని రేవంత్ రెడ్డి కూడా అన్నారంటూ సమర్ధించుకునే ప్రయత్నం చేశారు కౌశిక్ రెడ్డి.
మహిళలకు ఉచిత ప్రయాణం అంతా వట్టిదేనంటూ కేటీఆర్ ఆరోపించారు. అందుకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నువ్వు చీర కట్టుకొని బస్సు వద్దకు వెళ్ళు. అప్పుడు నిన్ను బస్సు ఎక్కనివ్వకపోతే అప్పుడు ప్రశ్నించు అంటూ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇవ్వడం జరిగింది. కేటీఆర్ మాట్లాడిన మాటలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కాని కౌశిక్ రెడ్డి కొంత దూకుడుగా వెళ్లడంతో గురి తప్పింది.
పార్టీ కండువా మార్చుకున్న ఎమ్మెల్యేల విషయంలో చీర, గాజుల ప్రస్తావన తెచ్చి తొందరపడ్డారు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి రాజకీయ వర్గాల్లో. కౌశిక్ రెడ్డి చీర, గాజుల ప్రస్తావన తేవడంతో మహిళల్లో ఆగ్రహం తెచ్చింది.సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన సందర్భం వేరేగా ఉంది. కౌశిక్ రెడ్డి మాట్లాడిన తీరు వేరేలా ఉంది. రేవంత్ రెడ్డి మాదిరిగానే తాను మాట్లాడిన అంటూ బైపాస్ కావడానికి కౌశిక్ రెడ్డి ప్రయత్నించారు. కానీ సందర్భం వేరువేరుగా ఉంది. తప్పించుకోవాలనుకుంటే కౌశిక్ రెడ్డి విమర్శలకు గురికావాల్సిన పరిస్థితి ఏర్పడింది.