Home » Minister Challange : ఆలా అయితే నా ఇంటిని మీరే కూల్చివేయండి… సవాల్ విసిరిన ఆ మంత్రి

Minister Challange : ఆలా అయితే నా ఇంటిని మీరే కూల్చివేయండి… సవాల్ విసిరిన ఆ మంత్రి

Minister Challange : ఉనికిని చాటుకోడానికి అనవసరంగా మాట్లాడకండి. నిజాలు తెలుసుకొని మాట్లాడాలి. అప్పుడే ప్రజలు నమ్ముతారు. అక్రమ కట్టడాలను కూల్చి వేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. హైడ్రాను తమ ప్రభుత్వంలో ఏ ఒక్కరు కూడా అడ్డుకోవడం లేదు. నిబంధనల మేరకు హైడ్రా పనిచేస్తుంది. నా ఇంటిని అక్రమంగా నిర్మించి ఉంటే మీరే స్వయంగా వెళ్లి కూల్చి వేయండి అంటూ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులకు సవాల్ విసిరారు.
హిమయత్‌సాగర్ ప్రాంతంలో ఎఫ్‌టీఎల్ పరిధిలో తన ఫాంహౌస్ ఉందని బీఆర్ఎస్ పార్టీ మీడియా ఆరోపించడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు బదులుగా అయన సవాల్ విసిరారు.

తానూ కూడా వెనక్కి తగ్గడం లేదన్నారు మంత్రి. మీరే వెళ్లి ఆ ఇంటిని కొలవండి. అక్రమంగా నిర్మించి ఉంటె మీరే స్వయంగా కూలగొట్టండి. హైడ్రా కమిషనర్ ను కూడా ఆదేశించాను. అక్రమమని తేలితే చర్యలు తీసుకోవాలని ఆదేశించాను అంటూ మంత్రి వివరించారు. మీ ఇద్దరి మాదిరిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒకరితో చెప్పించుకునే పరిస్థితిలో లేడన్నారు. ఆ ఇంటిలో తాను ఉంటున్నానని, కేటీఆర్ మాదిరిగా ఒకసారి నాదని, మరోసారి నాది కాదు, లీజు తీసుకున్నానని చెప్పి తప్పించుకోవడం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ సంధర్బంగా స్పష్టం చేశారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *