మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో పర్యావరణ దినోత్సవం
దేశంలోని పలు ప్రాంతాల్లో మొక్కలు నాటిన మోర్చా నాయకులు
బిజెపి తెలంగాణ మైనార్టీ మోర్చా
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్
కోల్ బెల్ట్ న్యూస్ (మంచిర్యాల) : భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో పార్టీ జాతీయ కమిటి పిలుపు మేరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని దేశంలోని పలు ప్రాంతాల్లో మైనార్టీ మోర్చా నాయకులు, కార్యకర్తలు మొక్కలు నాటారు. దేశంలోని గురుద్వార్ (అఫ్జల్గంజ్), దిగంబర్ జైన్ మందిరం (ఆగాపూరా), జైన్ మందిరం (కుషల్ దాదావడి) లలో మొక్కలను నాటారు.
ఈ కార్యక్రమంలో బిజెపి తెలంగాణ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు జగ్ మోహన్ సింగ్, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, మోర్చా ప్రబారి జై శ్రీ, బిజెపి తెలంగాణ మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్ తో పాటు రాష్ట్ర కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా బిజెపి తెలంగాణ మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని నాటిన ప్రతి మొక్క ఎదిగి సమాజానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అదే విదంగా ప్రతి కార్యకర్త కూడా దేశ సేవతో పాటు, సమాజ సేవకు ఉపయోగపడేవిధంగా తయారు కావాలని కోరారు. అన్ని కాలాలను తట్టుకొని మొక్క ఎదిగి మహా వృక్షము అవుతుంది. అదే విధంగా కార్యకర్త కూడా పార్టీ భాద్యతలను క్రమశిక్షణతో నిర్వర్తించినప్పుడు జాతీయ స్థాయికి చేరుకుంటారన్నారు.

by