Ginger : భోజనంలో కూర తయారు చేసుకునేటప్పుడు ఖచ్చితంగా కోరల్లో అల్లం వాడుతారు. అంతే కాదు బిర్యాని, బగారా వంటల్లో కూడా అల్లం వేస్తారు. ఈ రోజుల్లో చాలా మంది పలు ప్రైవేట్ సంస్థలు తయారు చేసిన అల్లం పేస్ట్ వాడుతున్నారు. కానీ అది రుచిగా ఉండదని చాలా మంది అభిప్రాయాలు సైతం ఉన్నవి. అప్పటి కప్పుడు అల్లం పేస్ట్ తయారు చేసుకోవాలంటే కొంత సమయం పడుతుంది. తొందరగా అల్లం పొట్టు సులభంగా తీయడానికి పలు పద్ధతులు కూడా ఉన్నవి.
అల్లం పొట్టు తీయడానికి ఒక గంట ముందుగా ఫ్రిజ్ లో పెట్టండి. గంట తరువాత చెంచా తో పొట్టు తీస్తే సులభంగా ఊడిపోతుంది.
అల్లం పొత్తు తీయడానికి అర్ధ గంట వేడి నీటిలో నానపెట్టాలి. అర్ద గంట తరువాత అల్లం పొట్టును చేతితో తీసినా సులభంగా పోతుంది.
ఇప్పుడు మార్కెట్ లో అల్లం పొత్తు తీయడానికి పలు రకాల వస్తువులు అందుబాటులో ఉన్నవి. అందులో జింజర్ పీలర్ పరికరం కూడా ఉంది. దింతో పొత్తు తీయడం చాలా సులభం