cinema : తమ అభిమాన నటుడి సినిమా వస్తోందంటే అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. అభిమాన నటుడి డ్యాన్స్, పాటలు, ఫయిటింగ్ లపై రకరకాలుగా ఊహలు పెంచుకుంటారు. సినిమా కూడా ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురుచూస్తుంటారు. సినిమా ఫ్రీ రిలీజ్ రోజును పండుగలా జరుపుకుంటారు. అదే విదంగా విజయవంతమైతే ఆ సంబరాలు చెప్పనక్కర లేదు. ఘనంగా జరుపు కుంటారు. కానీ సినిమా ప్లాప్ అయ్యిందంటే అభిమానుల ఆవేదన కూడా చెప్పలేని విదంగా ఉంటుంది.
అయితే ఇటీవల ఒక గొప్ప నటుడి కుటుంబానికి చెందిన నటుడు నటించిన సినిమా కేవలం తియేటర్లో ఐదు రోజులే నడిచింది. ఆ సినిమా వస్తుందని తెలిసి ఆయన అభిమానులు ఎంతో సంబరపడిపోయారు. కానీ అభిమానుల ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఆ సినిమా పేరు ” మట్కా ” సినిమా హీరో వరుణ్ తేజ్ .
రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా పెట్టుబడి దారులు 2024 నవంబర్ 14న ఘనంగా విడుదల చేశారు. కేవలం ఐదు అంటే ఐదు రోజులే సినిమా ఆడింది. ఆరో రోజు నుంచి ఎక్కడ కూడా ఒక్క టికెట్ కూడా అమ్ముడు పోలేదు. అభిమానులు కూడా థియేటర్ల వైపు తొంగి చూడలేదు. అంటే సినిమా స్టోరీ ఏ స్థాయిలో ఉందొ చెప్పాల్సిన అవసరం లేదు.