jobs : మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళలకు శుభవార్త ప్రకటించబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. అర్హులైన మహిళలకు ఇది గొప్ప వరం. కేవలం పదోతరగతి అర్హత ఉంటె సరిపోతుంది. తెలంగాణ రాష్ట్రంలో 14 వేల ఉద్యోగాలకు రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించబోతున్నారు. మహిళా దినోత్సవం సందర్బంగా లక్ష మంది మహిళల సమక్షములో నోటిఫికేషన్ ను విడుదల చేయబోతున్నారు.
నోటిఫికేషన్ ను ఇదే నెలలో విడుదల చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. పదో తరగతి ఉత్తీర్ణులైన వారంతా కూడా ఈ ఉద్యోగాలకు అర్జులే అవుతారు. మహిళా శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న అంగన్ వాడి టీచర్, ఆయా పోస్టులను భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైనది.
దరఖాస్తు చేసుకున్న వారందరికి ముందుగా రాత పరీక్ష నిర్వహించనున్నారు. రాత పరీక్షలో ప్రతిభ చాటుకున్నవారి సర్టిఫికెట్లను పరిశీలించిన అనంతరం నియామక పత్రాలను రాష్ట్ర ప్రభుత్వం అందజేయనుంది. పదోతరగతి ఆధారమైన ప్రశ్నలను పరీక్షలో అడుగనున్నారు.