INTUC : మందమర్రి ఏరియా సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ (INTUC ) కార్యదర్శిగా ఈదునూరి బాపు ను నియమిస్తూ యూనియన్ సెక్రటరీ జనరల్ బి జనక్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. నియామక లేఖను యూనియన్ కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు కాంపెల్లి సమ్మయ్య యూనియన్ కార్యాలయంలో అందజేశారు.
ఈదునూరి బాపు మందమర్రి ఏరియాలోని కాసిపేట గనిలో ఎస్డీఎల్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్నారు. బాపు మొదటి నుంచి ఐఎన్టీయూసీ లోనే ఉంటూ యూనియన్ బలోపేతానికి కృషిచేస్తున్నారు. గతంలో సాజక్ లో పని చేసిన అనుభవం ఉంది. కార్మిక వర్గాల సమస్యలపై అవగాహన ఉన్న యూనియన్ సీనియర్ నాయకుడిగా మందమర్రి ఏరియాలో సుపరిచితుడు. సౌమ్యుడిగా పేరున్నటువంటి బాపుకు యూనియన్ అగ్రనాయకులతో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కొనసాగిస్తాడనే పేరు ఉంది. కేంద్ర కమిటీ నాయకులకు నమ్మకస్తుడిగా యూనియన్ లో ప్రచారం కూడా ఉండటం విశేషం. కార్మిక వర్గాల అపరిష్కృత సమస్యల కోసం యూనియన్ చేసే పోరాటాల్లో కూడా బాపు ఎప్పుడు కూడా ముందుంటారు.
ఈ సందర్బంగా భాద్యతలు చేపట్టిన బాపు మాట్లాడుతూ యూనియన్ ఆదేశాల మేరకు కార్మిక సమస్యల పరిస్కారం కోసం కృషిచేస్తానన్నారు. ఈ భాద్యతలు అప్పగించిన సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్, కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు కాంపెల్లి సమ్మయ్య లకు కృతజ్ఞతలు తెలిపారు. భాద్యతలు చేపట్టిన బాపును మందమర్రి యూనియన్ కార్యాలయంలో యూనియన్ కేంద్ర కమిటీ, మందమర్రి ఏరియా కమిటీ నాయకులు, కార్యకర్తలు మిట్ట సూర్యనారాయణ, శంకర్ రావు, దేవి భూమయ్య, సంగ బుచ్చయ్య, పానుగంటి వెంకట స్వామి తదితరులు ఈదునూరి బాపును ఘనంగా అభినందించారు.

by