Accident : రామగుండము రీజియన్ లోని రామగుండము 3 ఏరియాలోని OCP 2 గనిలో జరిగిన ప్రమాదానికి ఆ గని అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని శ్రీరాంపూర్ ఏరియా ఎస్సీ, ఎస్టి ఉద్యోగుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు డేగల ప్రవీణ్ ఆరోపించారు. ప్రవీణ్ సంఘం కార్యాలయంలో మాట్లాడుతో గని సంబంధిత అధికారులు పర్యవేక్షణ లోపం ప్రమాదం జరిగిన సంఘటనలో స్పష్టంగా కనబడుతోందని ఆయన ఆరోపించారు. వర్షాకాలంలో ఓపెన్ కాస్ట్ గనుల్లో చేపట్టాల్సిన రక్షణ చర్యలు కూడా సక్రమంగా లేవన్నారు. గని మేనేజర్ కూడా గనిలోకి దిగి పర్యవేక్షణ చేయడం లేదని ఆయన ఆరోపించారు. ఓపెన్ కాస్ట్ గనుల్లో ప్రమాదాలు జరుతున్నాయంటే అది కచ్చితంగా అధికారుల పర్యవేక్షణ లోపమన్నారు. పని స్థలాల్లో ముందస్తు జాగ్రత్తలు ఎందుకు తీసుకోవడం లేదని ఆయన సంబంధిత గని అధికారులను ఈ సందర్బంగా ప్రశ్నించారు.
కొందరు అధికారులు రక్షణ విషయంలో సరైన జాగ్రత్తలు కూడా తీసుకోవడం లేదని ప్రవీణ్ ఈ సందర్బంగ ఆరోపించారు. ఓసీపీ 2 లో ప్రమాదం జరిగి కార్మికుడు మృతిచెందడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కార్మికుడి కుటుంబానికి తమ సంఘం ఎల్లవేళలా అందుబాటులో ఉండి సహాయ, సహకారం అందిస్తుందన్నారు. మృతి చెందిన కార్మికుడి కుటుంబ సభ్యులకు రావాల్సిన ప్రయోజనాలు సకలంలో అందజేయాలని ఆయన గని అధికారులను కోరారు. ఆయనతో పాటు మాట్లాడిన వారిలో అసోసియేషన్ శాఖ కార్యదర్శి రెడపాక లక్ష్మణ్, నక్క సుమన్, అందె వెంకటేష్, కుక్క శ్రీనివాస్, గోదారి మురళి, కమల్, సుందిళ్ల నరేష్, మహేందర్ అసోసియేషన్ సబ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.